‘ అదిరింది ‘ మ‌ళ్లీ బెదిరింది… వాయిదా వెన‌క షాకింగ్ ట్విస్ట్‌

కోలీవుడ్ స్టార్ హీరో ఇళ‌య ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించిన మెర్స‌ల్ సినిమా డివైడ్ టాక్‌తో కూడా వ‌సూళ్ల ప్ర‌భంజ‌నం క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా ఐదు రోజుల‌కే వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఐదు రోజుల‌కే రూ.150 కోట్ల గ్రాస్ కొల్ల‌గొట్టింది. ఇదిలా ఉంటే ఈ సినిమాను తెలుగులో అదిరింది పేరుతో రిలీజ్ చేసేందుకు ప‌వ‌న్ స‌న్నిహితుడు, నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ అధినేత శ‌ర‌త్‌మ‌రార్ ప్లాన్ చేసుకున్నారు. ఇప్ప‌టికే ప‌బ్లిసిటీ కోసం ఏకంగా రూ.2 కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు చేశారు. అయితే సినిమా మాత్రం విడుద‌ల‌కు నోచుకోవ‌డం లేదు.

గ‌త శుక్ర‌వారం రావాల్సిన సినిమా ఈ నెల 27న వ‌స్తుంద‌ని ప్ర‌క‌టించారు. పేప‌ర్ల‌లోను, టీవీల్లోను ప్ర‌క‌ట‌న‌లు కూడా ఇచ్చారు. థియేట‌ర్ల‌లో ఆన్‌లైన్ అడ్వాన్స్ బుకింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. అయితే గురువారం సాయంత్ర‌మే సినిమాను మ‌రోసారి వాయిదా వేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించి ఈ సినిమా కోసం ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తోన్న తెలుగు ఆడియెన్స్‌ను తీవ్ర నిరాశ‌కు గురి చేశారు. త‌మిళ్‌లో జీఎస్టీ, డిజిట‌ల్ ఇండియా పేరుతో విజ‌య్ కేంద్ ప్ర‌భుత్వాన్ని టార్గెట్‌గా చేసుకుని వేసిన పంచ్‌లు బాగా పేలాయి. దీంతో తెలుగులో సినిమాపై మంచి బ‌జ్ క్రియేట్ అయ్యింది.

అట్లీ దర్శకత్వం వ‌హించిన ఈ సినిమాపై కేంద్ర ప్ర‌భుత్వంతో పాటు బీజేపీ కూడా మండిప‌డుతోంది. ఇదిలా ఉంటే ఇత‌ర ప్ర‌ముఖ న‌టులు క‌మ‌ల్, ర‌జ‌నీతో పాటు కాంగ్రెస్ లీడ‌ర్ రాహుల్‌గాంధీ లాంటి వాళ్లు ఈ సినిమాకు స‌పోర్ట్‌గా నిలుస్తున్నారు. ఇక తెలుగు వెర్ష‌న్ సెన్సార్ కాక‌పోవ‌డంతోనే అదిరింది తెలుగులో విడుద‌ల కావ‌డం లేదు. షాక్ ఏంటంటే కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా సినిమాలో ఉన్న డైలాగుల‌ను తొల‌గిస్తే త‌ప్ప సెన్సార్ చేయ‌మ‌ని సెన్సార్ బోర్డు స‌భ్యులు చెప్ప‌డంతో నిర్మాత‌లు అందుకు అంగీక‌రించ‌లేద‌ని తెలుస్తోంది. దీంతో సినిమా మ‌రోసారి వాయిదా ప‌డింది.