కళ్యాణ్ రామ్ ‘ఎమ్మెల్యే’ థియేట్రికల్ ట్రైలర్

March 16, 2018 at 6:23 pm
MLA Theatrical Trailer,  Nandamuri Kalyan Ram, Kajal Aggarwal

ఇజం సినిమా త‌ర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్న నంద‌మూరి హీరో క‌ళ్యాణ్‌రామ్ ప్ర‌స్తుతం వ‌రుస‌గా రెండు సినిమాల్లో న‌టిస్తున్నాడు. ఉపేంద్ర మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో కాజ‌ల్ హీరోయిన్‌గా ఎమ్మెల్యే – మంచి ల‌క్ష‌ణాలు ఉన్న అబ్బాయి సినిమాతో పాటు త‌మ‌న్నా హీరోయిన్‌గా నానువ్వే సినిమాలో కూడా చేస్తున్నాడు. ఇక వీటిల్లో ఈ నెల 23న రిలీజ్ అవుతోన్న ఎమ్మెల్యే సినిమా ట్రైల‌ర్ రిలీజ్ అయ్యింది. 

 

ఇప్ప‌టికే సెన్సార్ బోర్డు నుంచి యూ /  ఏ స‌ర్టిఫికెట్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఈ నెల 23న థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. చాలా రోజుల గ్యాప్ త‌ర్వాత క‌ళ్యాణ్‌రామ్ స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టించింది. గ‌తంలో వీరిద్ద‌రు క‌లిసి తేజ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ల‌క్ష్మీక‌ళ్యాణం సినిమాలో న‌టించారు. ఇప్పుడు గ్యాప్ త‌ర్వాత ఈ సినిమాలో న‌టిస్తున్నారు.

 

ఇక తాజాగా రిలీజ్ అయిన ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే 1.44 నిమిషాల పాటు ఉన్న ట్రైల‌ర్ చూస్తుంటే సినిమా రాజ‌కీయం నేప‌థ్యంలో సాగుతుంద‌ని తెలుస్తోంది. న‌న్ను మా ఊళ్లో అంద‌రూ మంచి ల‌క్ష‌ణాలు ఉన్న అబ్బాయి అని పిలుస్తారు.. దీనినే షార్ట్ క‌ట్‌లో ఎమ్మెల్యే అంటారు… త‌న జ‌నం త‌న వెన‌క ఉండ‌ర‌ని.. బ్యాలెట్ బాక్సుల్లో ఉంటార‌ని పేల్చిన పంచ్ ఇర‌గ‌దీసింది.  

కళ్యాణ్ రామ్ ‘ఎమ్మెల్యే’ థియేట్రికల్ ట్రైలర్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share