మోహ‌న్ బాబు ఇంట విషాదం

September 20, 2018 at 9:34 am

తెలుగు చిత్రసీమంలో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు. కేవలం నటన మాత్రమే కాదు నిర్మాత, దర్శకుడిగా కూడా తన సత్తా చాటారు. అలనాటి మహానటుడు ఎన్టీఆర్ కి మోహన్ బాబు కి ఎంతో అనుబంధం ఉండేది…ఎన్టీఆర్ సినిమాల్లో ఎక్కువగా నటించే వారు మోహన్ బాబు. ఇక ఇండస్ట్రీలో ఆయన గాడ్ ఫాదర్ అని చెప్పే వ్యక్తి దివంగత దర్శకరత్న దాసరి నారాయణ రావు.

ప్రస్తుతం ఇండస్ట్రీ మంచు మోహన్ బాబు వారసులు మంచు విష్ణు, మనోజ్ లతో పాటు ఆయన కూతురు మంచి లక్ష్మి నటిగా, బుల్లితెరపై యాంకర్ గా రాణిస్తున్నారు. తాజాగా మంచు మోహన్ బాబు ఇంట విషాదం చోటు చేసుకుంది. మోహ‌న్ బాబు మాతృమూర్తి మంచు ల‌క్ష్మ‌మ్మ (85) క‌న్నుమూశారు.

తిరుప‌తిలోని శ్రీ‌విద్యానికేత‌న్‌లో ఈ రోజు ఉద‌యం ఆరుగంట‌ల‌కు ఆమె తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న మోహన్‌ బాబు, ఆయన కుటుంబ సభ్యులు ఈ విషయం తెలుసుకుని స్వదేశానికి బయలుదేరారని సమాచారం. మంచు లక్ష్మమ్మ అంత్యక్రియలు రేపు తిరుపతిలో జరుగనున్నాయి.శుక్ర‌వారం తిరుప‌తిలో ల‌క్ష్మ‌మ్మ ద‌హ‌న సంస్కారాలు జ‌రుగుతాయి.

మోహ‌న్ బాబు ఇంట విషాదం
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share