నంది అవార్డుల‌పై మోహ‌న్‌బాబు పెద్ద బాంబు

February 2, 2018 at 11:04 am
mohan babu

ఇటీవ‌ల నంది అవార్డుల‌పై పెద్ద ర‌చ్చ న‌డిచింది. నంది అవార్డుల ఎంపిక‌లో న్యాయ‌నిర్ణేత‌లు ర‌క‌ర‌కాల వివ‌క్ష‌త పాటించార‌న్న ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. కొంద‌రు త‌మ‌కు కావాల్సిన వాళ్ల‌కు నందులు ఇప్పించుకున్నార‌ని, మ‌రికొంద‌రు కుల వివ‌క్ష‌త పాటించార‌ని, మ‌రికొంద‌రు రిక‌మెండేష‌న్ చేయించుకుని అవార్డులు ద‌క్కించుకున్నార‌ని ప‌లు ర‌కాల విమ‌ర్శ‌లు ఈ అవార్డుల‌పై వ‌చ్చాయి. తాజాగా ఇదే వివాదంపై సీనియ‌ర్ న‌టుడు, క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు కూడా స్పందించ‌డంతో పాటు నంది అవార్డుల‌నేవి 99 శాతం రిక‌మెండేష‌న్ మీదే వ‌స్తాయ‌ని సెటైర్లు వేశారు.

ఓ ప్ర‌ముఖ ఛానెల్ ఇంట‌ర్వ్యూలో ఈ ప్ర‌శ్న‌కు మోహ‌న్‌బాబు ఆన్స‌ర్ ఇచ్చారు. జాతీయ స్థాయి అవార్డు అయిన ప‌ద్మ‌శ్రీ  పొందిన మోహ‌న్‌బాబు రాష్ట్ర స్థాయి అవార్డు అయిన నంది అవార్డుకు ఎందుకు అర్హుడు కాడు అన్న ప్ర‌శ్న‌పై ఆయ‌న మాట్లాడుతూ మీరు ఆ ప్ర‌శ్న నంది అవార్డుల‌ను ఎంపిక చేసిన న్యాయ‌నిర్ణేత‌ల‌ను అడ‌గాల‌న్నారు. నంది అవార్డుల‌నేవి చాలా వ‌రకు రిక‌మెండేష‌న్ల మీదే తెచ్చుకుంటార‌ని తాను ఆ సంస్కృతికి పూర్తిగా విరుద్ధ‌మ‌ని క‌లెక్ష‌న్ కింగ్ కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు. 

ఇలా రిక‌మెండేష‌న్లు చేసుకుని తెచ్చుకునే అవార్డులు త‌న‌కు వ‌ద్ద‌ని ఆయ‌న చెప్పారు. ఇక తన కుమార్తె ల‌క్ష్మీప్ర‌స‌న్నకు అవార్డు వ‌చ్చింద‌ని, ఈ విష‌యం ఆమె చెప్పాకే త‌న‌కు తెలిసింద‌ని ఆయ‌న చెప్పారు. ఇక ఈ అవార్డులు అవార్డులు ఎంపిక చేసేవాళ్లు వాళ్ల‌కు కావాల్సిన వాళ్ల‌కు ఇచ్చుకున్నార‌ని మోహ‌న్‌బాబు బాంబు పేల్చారు. త‌న‌కు, త‌న కుటుంబానికి అవార్డుల క‌న్నా ప్ర‌జాదీవెన‌లే కావాల‌ని చెప్పారు. 

తాను సినిమా తీస్తే హిట్ అవ్వాల‌ని, డ‌బ్బులు రావాల‌ని ప‌దిమందికి బాగుప‌డాల‌నే కోరుకుంటానే త‌ప్పా త‌న‌కు అవార్డులు ముఖ్యం కాద‌న్నారు. ఏదేమైనా మోహ‌న్‌బాబు ఫైన‌ల్‌గా నంది అవార్డుల‌ను రిక‌మెండేష‌న్ అవార్డులుగా తేల్చిప‌డేశారు. 

 

నంది అవార్డుల‌పై మోహ‌న్‌బాబు పెద్ద బాంబు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share