మోక్షు డెబ్యూ మూవీపై బాలయ్య కండిషన్స్

నందమూరి బాలకృష్ణ తనయుడు నంద‌మూరి మోక్షజ్ఞ వెండి తెరంగ్రేటం ఈ యేడాది చివ‌ర్లో ఉండే ఛాన్సులు క‌నిపిస్తున్నాయి. మోక్ష‌జ్ఞ ఎంట్రీ గురించి గ‌తేడాది నుంచే వార్త‌లు వ‌స్తున్నాయి. బాల‌య్య శాత‌క‌ర్ణిలో మోక్ష‌జ్ఞ శాత‌క‌ర్ణి త‌న‌యుడు వశిష్టీపుత్ర పులోమావి రోల్ చేస్తాడ‌ని వార్త‌లు వ‌చ్చినా అది జ‌ర‌గ‌లేదు.

ఇక మోక్ష‌జ్ఞ ప్ర‌స్తుతం యాక్టింగ్‌లో, డ్యాన్స్‌లో శిక్షణ తీసుకుటుండ‌డంతో పాటు ఫిట్‌నెస్ సాధించే ప‌నిలో బిజీగా ఉన్నాడు. ఇక మోక్ష‌జ్ఞ డెబ్యూ మూవీకి బాల‌య్య‌కు అత్యంత స‌న్నిహితుడైన వారాహి చల‌న‌చిత్రం అధినేత సాయి కొర్ర‌పాటి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ఈ సినిమాకు చాలా మంది స్టార్ డైరెక్ట‌ర్ల పేర్లు వినిపిస్తున్నాయి.

ఇక మోక్షును తొలి సినిమాలో యాక్ష‌న్ హీరోగా కాకుండా ప‌క్కింటి కుర్రాడి రోల్‌లో ప‌రిచ‌యం చేయాల‌ని బాల‌య్య భావిస్తున్నాడ‌ట‌. యాక్ష‌న్ హీరోగా తొలి సినిమాతోనే భారీ అంచ‌నాల‌తో వ‌స్తే అవి ఏ మాత్రం త‌గ్గినా మోక్షుపై ఒత్తిడి ఉంటుంద‌న్న ఉద్దేశంతో బాల‌య్య మోక్షును చిన్న బ‌డ్జెట్‌లో స్మాల్ రోల్‌తో ప‌రిచ‌యం చేయించాల‌ని ప్లాన్ చేస్తున్నాడ‌ట‌.