మల్టీప్లెక్స్ ప్రేక్షకులకు తీపి కబురు

July 14, 2018 at 1:05 pm
Multiplex

మనం ఎంత టెన్షన్ లో ఉన్నా..మూడు గంటలు రిలాక్స్ కోసం సినిమా థియేటర్లకు వెళ్తుంటాం. ఈ మద్య కాలంలో సామాన్యులకు సినిమా థియేటర్లకు వెళ్లాలంటే భయం పట్టుకుంది. ఇక మల్టీప్లక్స్ థియేటర్ల గురించి చెప్పక్కరలేదు..ఒక కుటుంబం వెళ్లాలంటే..జెబు గుల్లా అయినట్లే లెక్క. సినిమా చూడటానికి వెళ్తే ధియేటర్ యాజమాన్యాలు పలు రకాల ఫీజులతో పాటు.. బయట నుండి తెచ్చే తిను బండరాలపై నిషేధం విధిస్తున్నాయి. అలాగని లోపల ఏమైనా ఎం.ఆర్.పీ. రేట్లకే ఇస్తారా అదీ లేదు..అడ్డగోలు వసూళ్లు చేస్తున్నారు.

మల్టీప్లెక్స్‌లకు వెళ్లే సినీ ప్రేక్షకులకు గుడ్‌‌న్యూస్. అక్కడ స్టాల్స్ అమ్మే వస్తువుల అధిక ధరలకు కళ్లెం వేసేలా చర్యలు తీసుకుంది మహారాష్ట్ర సర్కార్. మల్టీప్లెక్స్‌లోనే కొనాలన్న నిబంధనకు అడ్డుకట్ట వేస్తూ అక్కడి ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. మల్టీప్లెక్స్‌లకు వెళ్లేటప్పుడు ఇంట్లో తయారు చేసుకున్న ఫుడ్ కూడా తీసుకొని వెళ్లొచ్చు. అంతేకాదు ఆహార పదార్థాలను అధిక ధరలకు విక్రయిస్తున్న మాల్స్‌, మల్టీప్లెక్స్‌లపై చర్యలు తీసుకునేందుకు కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. దీనిపై ఆరువారాల్లో విధివిధానాలు రూపొందించే పనిలోపడింది.

ఒకవేళ సినిమా థియేటర్లు ఈ నిబంధనను పాటించకుంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపైనా మహారాష్ట్ర ప్రభుత్వం ఓ విధానాన్ని రూపొందించాలనే ఆలోచనలో ఉంది. ఈ వివరాలను ఆ రాష్ట్ర ఆహార శాఖ మంత్రి రవీంద్ర చావన్ మీడియాకు తెలిపారు. ఫుడ్ ఐటమ్స్‌తో సినిమాకు వెళ్తున్నవారిని ఇకపై ఎవరైనా అడ్డుకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

మహరాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలుసుకున్న తర్వాత తెలుగు రాష్ట్రాల ప్రజలు తమ ప్రభుత్వాలు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని భావిస్తున్నారు. మహారాష్ట్ర నవ నిర్మాణ్‌ సేన ఈ వ్యవహారంపై ఓ మల్టీప్లెక్స్ యాజమాన్యంతో పోరాటానికి దిగిన విషయం తెల్సిందే! మరోవైపు బాంబే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు కావడంతో ఈ విషయంపై సమాధానం ఇవ్వాల్సిందిగా మహారాష్ట్ర సర్కార్‌ని ఆదేశించింది. దీంతో ప్రభుత్వం వెంటనే ఈ ప్రకటన చేసింది.

మల్టీప్లెక్స్ ప్రేక్షకులకు తీపి కబురు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share