‘మై డియర్ మార్తాండం’ టీజర్…పక్కా కామెడీ

July 22, 2018 at 11:34 am
My Dear Marthandam Official Teaser

టాలీవుడ్ లో ఈ మద్య కమెడియన్లు హీరోలుగా మారుతున్న విషయం తెలిసిందే. బ్రహ్మానందం, ఆలీ తర్వాత ఇప్పుడు సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి రీసెంట్ గా షకలక శంకర్ కూడా హీరోగా నటించాడు. తాజాగా ఇప్పుడు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఫృథ్విరాజ్ హీరోగా మారారు. ఇక కమెడియన్లు విషయానికి వస్తే..తెలుగు ఇండస్ట్రీ ఉన్నంతమంది కమెడియన్స్ వేరే ఏ భాషలో కూడా కనపడరు. అయితే తెలుగు లో ఎంత మంది కమెడియన్లు ఉన్నా..ఏమాత్రం కాంపిటీషన్ అనేదే లేదు. అంతే కాదు కమెడియన్లందరూ హీరో అవతారమెత్తడం కూడా తెలుగులో చాలా సాధారణమే.. అదే ట్రెండులో కామెడీని పండించడానికి ‘మై డియర్ మార్తాండం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు 30 ఇయర్స్ పృథ్వి గా సుపరిచితుడయిన పృథ్విరాజ్.

ఈ మద్య సినిమా టీజర్లు ప్రముఖులతో లాంచింగ్ చేయిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘మై డియర్ మార్తాండం ’ వైకాపా అధ్యక్షుడు YS జగన్మోహన్ రెడ్డి ఈమధ్యనే ఆవిష్కరించారు. టీజర్ ను చూస్తుంటే ఈ సినిమా మిగతా కమెడియన్ భారీ ఫైట్స్, డ్యాన్స్ లతో హడావుడి లేకుండా చాలా కూల్ గా ఉంది. టీజర్ ఓపెన్ చేయ్యగానే పృథ్వి తనకు మాత్రమే సాధ్యమైన స్టైల్ లో ‘పెళ్లి చేసుకోకుండా సన్యాసినయ్యాను.. ఈ కేసు వాదించి సన్నాసినయ్యాను” అనే పంచ్ ని విసురుతాడు. ఈ ఒక్క పంచ్ చాలు.. సినిమా ఎలా ఉండబోతోందో చెప్పడానికి. ఇదొక్కటే కాదు.

లాయర్ అవతారంలో క్లయింట్లను.. తోటి లాయర్లను.. చివరకి జడ్జిని కూడా వదలకుండా ముప్పతిప్పలు పెడుతున్నట్టుగా ‘మార్తాండం’ పాత్రను చూపించారు. టీజర్ చివర్లో ’30 రోజులలో లాయర్ కావడం ఎలా’ అనే పుస్తకాన్ని శ్రద్ధగా చదువుతున్నట్టుగా ఎక్స్ప్రెషన్ పెట్టాడు. చూస్తుంటే కొత్త దర్శకుడు హరీష్ రైట్ ట్రాక్ లో పృథ్వి కామెడీ టైమింగ్ ని ఫుల్లుగా వాడుకున్నట్టుగా అనిపిస్తోంది.

‘మై డియర్ మార్తాండం’ టీజర్…పక్కా కామెడీ
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share