నా పేరు సూర్య‌కు రిలీజ్‌కు ముందే పెద్ద దెబ్బ‌

May 2, 2018 at 9:30 am
Naa peru surya, allu Arjun, vakrantham vamsi, movie rights

స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ న‌టించిన నా పేరు సూర్య థియేట‌ర్ల‌లోకి దిగేందుకు మ‌రో రెండు రోజులు మాత్ర‌మే ఉంది. బ‌న్నీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే ఎందుకో గాని అటు ట్రేడ్‌వ‌ర్గాల్లోనూ ఇటు సినీ అభిమానుల్లోనూ ఎక్క‌డా లేని హైప్ ఉంటుంది. ఇటీవ‌ల బ‌న్నీ సినిమాల‌కు వ‌స్తోన్న క్రేజ్ మామూలుగా ఉండ‌డం లేదు. అయితే నా పేరు సూర్య‌కు ఎందుకోగాని సినిమా రిలీజ్ డేట్ ఇంకా రెండు రోజులే ఉన్నా బ‌న్నీ గ‌త సినిమాలంత హైప్ లేదు. 

 

వ‌రుస హిట్ల‌తో బ‌న్నీ సినిమాల్లోనే ఈ సినిమాకు హ‌య్య‌స్ట్ ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. డిస్ట్రిబ్యూటర్లు భారీ పెట్టుబడులు పెట్టారు. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి సుమారు 59 కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ టాక్.  క‌ర్ణాట‌క‌, రెస్టాఫ్ ఇండియా, త‌మిళ‌నాడు, మ‌ళ‌యాళం రైట్స్ కూడా క‌లుపుకుంటే రూ.75 వ‌ర‌కు కేవ‌లం థియేట్రిక‌ల్ రైట్స్ ద్వారానే స‌మ‌కూరిన‌ట్టు తెలుస్తోంది.

 

ఈ బిజినెస్‌ను బ‌ట్టి చూస్తే రూ.80 కోట్ల షేర్ ఈ సినిమా రాబ‌ట్టాల్సి ఉంది. బ్లాక్‌బ‌స్ట‌ర్ టాక్ రావాలి. అయితే అదంత సులువు కాదు. ఇటు ద‌ర్శ‌కుడు వ‌క్కంతం వంశీకి ఇదే డెబ్యూ మూవీ. ద‌ర్శ‌కుడిపై చాలా మందికి న‌మ్మ‌కం కుద‌ర‌డం లేదు. ఇక ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ టాక్‌తో పాటు మెగా క్యాంప్ హ‌డావిడి, వాళ్ల మాట‌ల‌ను బ‌ట్టి చూస్తుంటే కూడా సినిమా తేడా కొడుతోందంటున్నారు. 

 

సినిమా ర‌షెష్ చూశాక కూడా మెగా కాంపౌండ్ శాటిస్‌పై కాలేద‌ని టాక్‌. అందుకే అర‌వింద్ సినిమాపై కుట్ర అంటూ కొత్త చ‌ర్చ స్టార్ట్ చేశారంటున్నారు. ఇక థియేట‌ర్ల పోటీ కూడా గ‌ట్టిగానే ఉంది. భరత్ అనే నేను బాక్స్ ఆఫీస్ దగ్గర స్ట్రాంగ్ గానే ఉన్నాడు. రంగస్థలం వసూళ్లు బిసి సెంటర్స్ లో ఇంకా స్టడీగానే ఉన్నాయి. ఇక అవెంజ‌ర్స్ టోట‌ల్‌గా ఇండియా బాక్సాఫీస్‌ను సైతం షేక్ చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా ఎంతో కొంత ప్ర‌భావం చూప‌నుంది. 

 

ఇవ‌న్నీ ఇలా ఉంటే ఐపీఎల్ ఫీవ‌ర్ బాగా జ‌నాల‌ను ఊపేస్తోంది. సాయంత్రం అయితే చాలు ఫ‌స్ట్ షో, సెకండ్ షోల‌కు జ‌నాలు రావ‌డం త‌గ్గింది. పైగా హైదరాబాద్ సన్ రైజర్స్ టీం అనూహ్యంగా టైటిల్ ఫేవరేట్ గా మారడంతో ఫైనల్ దాకా ఇది తగ్గేలా లేదు. ఇటు ద‌ర్శ‌కుడికి ఇదే తొలిసినిమా. అత‌డి బ్రాండ్ మార్కెట్ లేదు. కేవ‌లం బ‌న్నీ ఇమేజ్‌తో పాటు సినిమాకు సూప‌ర్ హిట్ టాక్ వ‌స్తే త‌ప్ప ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బ్రేక్ ఈవెన్‌కు రాదు. మ‌రి ఈ గండాల‌ను సూర్య ఎలా అధిగ‌మిస్తాడో ?  చూడాలి.

 

నా పేరు సూర్య‌కు రిలీజ్‌కు ముందే పెద్ద దెబ్బ‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share