సామ్‌, చైతూల మ‌ధ్య ముద్దుల రాద్ధాంతం..

September 15, 2018 at 7:50 pm
Naga Chaitanya, Samantha, Trending, Social media, Lip to Lip

ఈ మ‌ధ్య తెలుగు తెర‌పై ముద్దుల ప‌ద్దు పెరిగిపోతోంది. గ‌తంలో హీరోహీరోయిన్లు ఇలా ద‌గ్గ‌రికి వ‌స్తోరో లేదో.. బాబోయ్ అంటూ సిగ్గులుపోయే తెలుగు ప్రేక్ష‌కులు ఇప్పుడు అవి ఉంటేనే సినిమా చూసే స్థాయికి చేరుకున్నారు. నిజానికి ఇప్పుడా సీన్లు కంట ప‌డందే.. యూత్‌కు సినిమా వంట‌బ‌ట్ట‌డం లేద‌ట‌. లిప్‌లాక్ కానిదే.. త‌`ప్తి చెంద‌డం లేదట‌… స‌రేగానీ.. ఈ ముచ్చ‌ట ఇక్క‌డితో వ‌దిలేసి.. అస‌లు విష‌యానికి వ‌ద్దాం.. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో అందులోనూ స‌మంత‌, చైతూ అభిమానుల మ‌ధ్య ఓ కోల్డ్ వార్ న‌డుస్తోంది.

3a-copy-768x512

అది కూడా ఈ లిప్‌లాక్ పైనే కావ‌డం గ‌మ‌నార్హం. ఈ లొల్లి కాస్తా ముదిరిపాకాన ప‌డుతోంది. ఇంత‌కీ ఎవ‌రు ఎవ‌రితో ఈ సీన్ల‌లో న‌టించారు..? చైతూ, స‌మంత‌ల మ‌ధ్య‌ ఎందుకీ ముద్దుల‌ రాద్దాంతం..? అని మీరు తెలుసుకోవాల‌ని అనుకుంటున్నారా..? అయితే.. ఈ క‌థ‌నంలోకి వెళ్లాల్సిందే మ‌రి. తెలుగు సినీరంగంలో రంగ‌స్థ‌లం బాక్సాఫీస్ బ‌ద్ధ‌లు కొట్టింది. అయితే ఇందులో వ‌చ్చిన ఓ ముద్దు స‌న్నివేశం మాత్ర పెద్ద రాంద్దాంత‌మే క్రియేట్ చేసింది. ఈ సినిమాలో రాంచ‌ర‌ణ్‌, స‌మంత మ‌ధ్య ఓ లిప్‌లాక్ ఉంది. దీనిపై అప్ప‌ట్లో సుదీర్ఘ చ‌ర్చ‌నే జ‌రిగింది.

కొంద‌రు విమ‌ర్శ‌లు.. మ‌రికొంద‌రు స‌ద్విమ‌ర్శ‌లు చేశారు. ఇక మ‌రికొంద‌రైతే.. ఇదేం పోయే కాలం.. పెళ్లైన పిల్ల‌.. అలా ప‌రాయిమొగాడిని ముద్దాడొచ్చా..? అంటూ దీర్ఘాలు తీశారు. కొంచెం హ‌ద్దుల్లో ఉండాల్సింది.. అంటూ ప‌లికారు. అయితే దీనిపై స‌మంత కూడా క్లారిటీ ఇచ్చింది. తాను నిజంగా రాంచ‌ర‌ణ్‌ను ముద్దాడ లేద‌నీ.. అందంతా కూడా కెమెరా మెన్ మాయ అంటూ స‌ర్దిచెప్పేందుకు ప్ర‌య‌త్నించింది. కానీ.. ఈ విష‌యం ఎవ‌రికీ పెద్ద‌గా న‌చ్చ‌లేదు. కొద్దిరోజుల త‌ర్వాత ఆ ముద్ద‌ల ముచ్చ‌ట‌ను అంద‌రూ మ‌రిచిపోయారు.

1-42

అయితే.. ఇటీవ‌లే విడుద‌లైన శైల‌జారెడ్డి అల్లుడు సినిమాలో చైతూ.. అనుఇమ్మానుయేల్ మ‌ధ్య లిప్‌లాక్ సీన్ ఉండ‌డంతో ఈ లొల్లి మ‌ళ్లీ మొద‌లైంది. పెళ్లైన నాగ‌చైత‌న్య‌.. ఈ సినిమాలో ఎలా లిప్‌లాక్ లో న‌టిస్తాడు..? అంటూ ప‌లువురు ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు. ఆనాడు స‌మంత‌ను విమ‌ర్శించిన‌వాళ్లు.. ఇవ్వాల‌.. చైతూను ఎందుకు నిల‌దీయడం లేదంటూ.. సోష‌ల్‌మీడియా వేదిక‌గా ఏకిపారేస్తున్నారు. మ‌హిళ‌కు ఓ రూల్‌.. మ‌గాడికో రూలా అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అయినా.. కాగితానికి లేని దుర‌ద క‌లానికెందుక‌న్న‌ట్టు… హాయిగా తెర‌పై రోమాంటిక్ సీన్లను ఆస్వాదించక‌.. అభిమానుల‌కెందుకో ఈ లొల్లి అని మ‌రికొంద‌రు సెటైర్లు వేస్తున్నారు.

సామ్‌, చైతూల మ‌ధ్య ముద్దుల రాద్ధాంతం..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share