స‌మంతలో చైతు చెప్పిన మైన‌స్ పాయింట్స్‌

అక్కినేని కుర్రాడు నాగ‌చైత‌న్య – క్యూటీ బ్యూటీ స‌మంత ఎంగేజ్‌మెంట్ పూర్త‌య్యింది. ఇక చైతు స‌మంత మెడ‌లో మూడ‌ముళ్లు వేయ‌డ‌మే మిగిలి ఉంది. వీరిద్ద‌రు మంచి అండ‌ర్‌స్టాండింగ్‌తో ముందుకు వెళుతున్నారు. ఇక త‌న‌కు కాబోయే భ‌ర్త గురించి స‌మంత పొగ‌డ్తల వ‌ర్షం కురిపించేస్తోంది. ఇటు చైతు కూడా స‌మంత‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నాడు. సోష‌ల్‌మీడియాలో వీరి అండ‌ర్‌స్టాండింగ్ అదుర్స్ అంటున్నారు.

ఇదిలా ఉంటే త‌న‌కు కాబోయే భార్య అంటే త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ని చెపుతోన్న చైతు కొన్ని విష‌యాల్లో మాత్రం ఆమెకు మైన‌స్ మార్కులు వేస్తున్నాడు. సోష‌ల్ మీడియాలో స‌మంత చాలా ప్రైవ‌సీతో ఉంటుంద‌ని…ఇది త‌న‌కు న‌చ్చ‌ద‌ని చైతు ఓపెన్‌గానే చెప్పేస్తున్నాడు.

సోష‌ల్ మీడియాలో ఏది రివీల్ చేయాలో…ఏది రివీల్ చేయ‌కూడ‌దో స‌మంత‌కు అస్స‌లు తెలియ‌దంటున్నాడు చైతు. పెళ్లికి ముందు దొరికిన ఈ ఫ్రీ టైంను స‌మంత ఇలా చ‌క్క‌గా ఎంజాయ్ చేస్తోంద‌ని…ఆమె హ్యాపీనెస్ కోసం తాను ఎడ్జెస్ట్ కాక త‌ప్ప‌డం లేదంటున్నాడు చైతు.

ఇక చైతు, స‌మంత ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నారు. వీరు సెప్టెంబ‌ర్‌లో పెళ్లి చేసుకోనున్నారు. చైతు లేటెస్ట్ మూవీ రారండోయ్ వేడుక చూద్దాం వ‌చ్చే శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగ‌తి తెలిసిందే.