చైతు సినిమాకు భారీ డీల్‌

June 5, 2018 at 3:08 pm
Nagachaithanya, maruthi. movie, big deal

యంగ్ డైరెక్ట‌ర్ మారుతి అటు డైరెక్ట‌ర్‌గాను, ఇటు నిర్మాత‌గాను కూడా స‌క్సెస్ అయ్యాడు. కెరీర్ స్టార్టింగ్‌లో కేవ‌లం యూత్‌ను టార్గెట్ చేసే సినిమాలు చేసిన మారుతి ఆ త‌ర్వాత బాబు బంగారం, మ‌హానుభావుడు, భ‌లే భ‌లే మ‌గాడివోయ్ లాంటి సినిమాల‌తో మంచి ఫ్యామిలీ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నాడు. మ‌హానుభావుడు సినిమా త‌ర్వాత మారుతి అక్కినేని హీరో నాగచైతన్యతో ‘శైలజా రెడ్డి అల్లుడు’ అనే సినిమాను రూపొందిస్తున్నాడు.

షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ సినిమా బిజినెస్ చూసి ట్రేడ్ వ‌ర్గాల‌కు, ఇండ‌స్ట్రీ జ‌నాల‌కు దిమ్మ‌తిరిగి పోయేలా ఉంది. మారుతి ఎలా ఉన్నా చైతుకు ఇప్ప‌ట‌కీ స‌రైన మార్కెట్ లేదు. చైతు – మారుతి కాంబో కావ‌డంతో అదిరిపోయే డీల్‌తో బిజినెస్ జ‌రుగుతోంది. కేవ‌లం రెస్టాఫ్ ఇండియా – ఓవ‌ర్సీస్‌తో పాటు ఇత‌ర ఏరియాలు (ఏపీ, తెలంగాణ మిన‌హా) రైట్స్ ద్వారానే రూ.14 కోట్లు వ‌చ్చేశాయి.

ఇక ఏపీ, తెలంగాణ రైట్స్ అమ్ముడు కాలేదు. ఈ సినిమాకు టోట‌ల్‌గా రూ.15 కోట్ల వ‌ర‌కు బ‌డ్జెట్ అయ్యింది. దాదాపుగా ఓవ‌ర్సీస్‌, రెస్టాఫ్‌, ఇత‌ర రైట్స్ ద్వారానే ఈ సినిమా బ‌డ్జెట్ వ‌చ్చేసింది. ఏపీ, తెలంగాణ రైట్స్ మొత్తం లాభాలే అన్న‌మాట‌. ఇక ఫ‌స్ట్ లుక్ రిలీజ్ కాకుండానే చైతు సినిమాకు ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఇంత బిజినెస్ జ‌ర‌గ‌డంతో అంద‌రూ షాక్‌లో ఉన్నారు. మ‌రి రిలీజ్ అయ్యాక ఈ సినిమా ఏం చేస్తుందో ? చూడాలి.

చైతు సినిమాకు భారీ డీల్‌
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share