నాగ్ పై మహేష్ ఫ్యాన్స్ ఆగ్రహం!

August 11, 2018 at 1:20 pm
Nagarjuna, Goodachari, success meet, speech, mahesh babu, fans, trolling

ఇండస్ట్రీలో టాప్ హీరోల ఫ్యాన్స్ తమ హీరో గురించి ఏ చిన్న విషయం తప్పుడు సమాచారం అందుకున్నా..తక్కువ చేసి మాట్లాడినా అలా చేసిన వారిని వెంటనే టార్గెట్ చేస్తారు. ఈ మద్య గూఢచారి హీరోయిన్ శోభితా దూళిపాళ్ల ప్రిన్స్ మహేష్ కి రెస్పెక్ట్ ఇవ్వలేదని ట్రోలింగ్ చేసి నానా హంగామా చేశారు. తాజాగా ఇప్పుడు కింగ్ నాగార్జున ను టార్గెట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దానికి కారణం ఈ మద్య గూఢచారి సక్సెస్ మీట్ లో నాగార్జున ఈ సినిమా గురించి చాలా గొప్పగా పొగిడారు. ఈ సినిమా తక్కువ బడ్జెట్ లో అద్భుతం సృష్టించిందని..ఇంత తక్కువ బడ్జెట్ భారీ లుకింగ్ తీసుకు వచ్చారని ఇలాంటి సినిమాలను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.

ఇదే సందర్భంలో ఈ సంవత్సరం భారీ విజయాలు సాధించిన రంగస్థలం, మహానటి సినిమాల తర్వాత గూఢచారి అంత గొప్పగా ఉందని..ఈ సినిమాలు డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు తెచ్చె పెట్టాయని ఇలాంటి సినిమాలు రావడం వల్ల డిస్ట్రీబ్యూటర్లు కూడా లాభాలు పొందుతారని అన్నారు. అయితే ఇక్కడే నాగార్జున కాస్త టంగ్ స్లిప్ అయినట్లు సమాచారం..ఎందుకంటే ఈ సంవత్సరం రంగస్థలం, మహానటి సినిమాలు మాత్రమే కాదు కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది.

Bharat-Ane-Nenu-int1

అంతే కాదు ఈ సినిమా రెండు వందదల కోట్ల క్లబ్ లో చేరింది. అంత గొప్ప సినిమాను నాగార్జున అసలు పట్టించుకోవకపోవడంపై మహేష్ ఫ్యాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ మద్య రాంగోపాల్ వర్మ, నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన ‘ఆఫీసర్’ కనీసం వారం రోజులు కూడా థియేటర్లో ఆడకపోవడాన్ని ప్రశ్ని తమ సినిమాల ఫెయిల్యూర్స్ గురించి చెప్పరు..కానీ సక్సెస్ అయిన సినిమాల గురించి పట్టించుకోకపోవడం చాలా విచారకరం అంటూ మహేష్ ఫ్యాన్స్ నాగార్జునను విమర్శిస్తూ..ట్రోలింగ్ చేస్తున్నారు.

akkineni-nagarjuna-officer-review-759

నాగ్ పై మహేష్ ఫ్యాన్స్ ఆగ్రహం!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share