నాగార్జున రిక్వెస్ట్ కేర్ చేయ‌ని వ‌ర్మ‌

January 25, 2018 at 2:16 pm
nag

నాగార్జున – రాంగోపాల్ వ‌ర్మ సినిమా అన‌గానే జ‌నాలు చాలా షాక్ అయ్యారు. ఇటీవ‌ల కాలంలో వ‌ర్మ ఫామ్ అంద‌రికి తెలిసిందే. అలాంటి వ‌ర్మ‌తో నాగ్ ఎలా సినిమా ఓకే చేశాడా ? అన్న సందేహాలు చాలా మందికే ఉన్నాయి. అయితే వ‌ర్మ‌తో ఉన్న అనుబంధం, త‌న కెరీర్ ట‌ర్న్ చేసిన శివ సినిమాను ఇవ్వ‌డం, వ‌ర్మ ఫామ్‌లోకి వ‌స్తే ఏదైనా చేస్తాడ‌న్న కాన్ఫిడెన్స్ ఇవ‌న్నీ క‌లిసి నాగ్‌కు ఎక్క‌డో చిన్న న‌మ్మ‌కం క‌లిగించాయి. అయితే ఈ సినిమాను ఒప్పుకునే ముందు నాగ్ వ‌ర్మ‌కు ఓ స‌ల‌హా ఇచ్చాడ‌ట‌.

ఇక తాజాగా నాగ్‌తో త‌న తాజా చిత్రం తెర‌కెక్కిస్తోన్న వ‌ర్మ తీరు చూస్తుంటే నాగ్ సలహాని ఆయన బేఖాతరు చేసినట్టే అనిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌కు ముందు నాగ్ మాట్లాడుతూ వ‌ర్మ ఇటీవ‌ల కాలంలో ఒకేసారి ఎక్కువ ప్రాజెక్టులు చేయ‌డం వ‌ల్ల స‌రిగా ఫోక‌స్ చేయ‌లేక ప్లాపులు తీశాడ‌ని…అందుకే త‌న ప్రాజెక్టు విష‌యంలో మాత్రం త‌న సినిమా పూర్త‌య్యే వ‌ర‌కు దీనిమీదే ఫోక‌స్ చేయాల‌న్న కండీష‌న్ పెట్టి ఈ సినిమాకు ఒప్పుకున్నాన‌ని నాగ్ చెప్పాడు. 

వ‌ర్మ స‌మ‌క్షంలోనే నాగ్ ఈ వ్యాఖ్య‌లు చేశాడు. అయితే ఇప్పుడు వ‌ర్మ తీరు చూస్తూంటే నాగ్‌కి ఇచ్చిన మాటని ప‌క్కన పెట్టినట్టే కనిపిస్తోంది. నాగ్ సినిమా మొదలెట్టాకే, కడప సిరీస్, జీఎస్టీ అంటూ వ‌ర్మ కాంట్ర‌వ‌ర్సీలు చేస్తున్నాడు. ఈ విషయాల మీద ఎక్క‌డ చూసినా మీడియాలో ర‌చ్చ ర‌చ్చ చేస్తున్నాడు. నాగ్ ప్రాజెక్ట్ తప్ప మిగతా అన్ని విషయాల మీదా టీవీల్లో కనిపిస్తున్నాడు వర్మ. 

ఏదేమైనా నాగ్ ష‌ర‌తును వ‌ర్మ చాలా లైట్ తీస్కొన్న‌ట్టే క‌న‌ప‌డుతోంది. ఇక ప్రాజెక్టు మ‌ధ్య‌లో ఏం చేస్తాం ? వ‌ర్మ మొండిత‌నం ఇలాగే ఉంటుందిగా అని నాగ్ స‌రిపెట్టుకుంటున్నాడ‌ట‌. ఈ సినిమాకు శ‌ప‌థం అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. స‌మ్మ‌ర్ కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

 

 

నాగార్జున రిక్వెస్ట్ కేర్ చేయ‌ని వ‌ర్మ‌
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share