చ‌ల‌ప‌తిరావుపై నాగ్ సీరియ‌స్‌

రారండోయ్ వేడుక చూద్దాం సినిమా ఆడియో వేడుక‌లో సీనియ‌ర్ న‌టుడు చ‌ల‌ప‌తిరావు మ‌హిళ‌ల‌పై చేసిన వ్యాఖ్య‌లు ఇండ‌స్ట్రీలోను సాధార‌ణ జ‌నాల్లోను తీవ్ర చ‌ర్చ‌కు దారి తీస్తున్నాయి. ఆ వేడుక‌లో చ‌ల‌ప‌తిరావు ఆడాళ్లు హానికరం కాదుగాని…పక్క‌లోకి ప‌నికొస్తార‌ని షాకింగ్ కామెంట్స్ చేశారు. చ‌ల‌ప‌తిరావు దారుణ‌మైన భాష‌లో చేసిన ఈ కామెంట్లపై ఇండ‌స్ట్రీ జ‌నాల నుంచి, మ‌హిళా సంఘాలు, ఇత‌ర సామాజిక సంస్థ‌ల నుంచి తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది.

సినిమాల్లో హీరోయిన్ల‌కు తండ్రి క్యారెక్ట‌ర్లు చేస్తూ ఎంతో సీనియ‌ర్ న‌టుడు, మంచివాడ‌న్న పేరున్న చ‌ల‌ప‌తిరావు ఇలాంటి దారుణ‌మైన వ్యాఖ్య‌లు ఎలా చేస్తార‌ని ప్ర‌తి ఒక్క‌రు ప్ర‌శ్నిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ వ్యాఖ్య‌ల‌ను ఇండ‌స్ట్రీలో చాలా మంది ప్ర‌ముఖులు ఖండించ‌గా ఇప్పుడు ఈ జాబితాలో సీనియ‌ర్ న‌టుడు, కింగ్ నాగార్జున సైతం చేరారు.

నాగార్జున చ‌ల‌ప‌తిరావు వ్యాఖ్య‌ల‌పై సీరియ‌స్‌గానే స్పందించారు. తాను వ్య‌క్తిగ‌తంగాను, సినిమాల్లోను మ‌హిళ‌ల‌ను ఎంతో గౌర‌విస్తాన‌న్న నాగ్ చ‌ల‌ప‌తిరావు వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తున్న‌ట్టు చెప్పారు. ఇక ఈ వ్యాఖ్య‌ల‌పై మ‌హిళ‌ల‌తో పాటు మ‌హిళా సంఘాల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోన్న నేప‌థ్యంలో చ‌ల‌ప‌తిరావు త‌ల‌తిక్క స‌మ‌ర్థ‌లు చేస్తున్నారు.

తాను దురుద్దేశంతో ఆ మాట‌లు అన‌లేద‌ని, వారి మ‌న‌స్సులు నొప్పించి ఉంటే క్ష‌మాప‌ణ‌లు కోరుతున్నాన‌ని, త‌న మాట‌ల‌కు డ‌బుల్ మీనింగ్‌లు అంట‌గ‌ట్ట‌వ‌ద్ద‌ని మీడియాకు విజ్ఞ‌ప్తి చేశారు. అన‌వ‌స‌రంగా నోరు జారిన మ‌న చ‌ల‌పాయ్ బాబాయ్ ఇప్పుడు విమ‌ర్శ‌ల చ‌క్ర‌బంధంలో త‌డిసి ముద్ద‌వుతున్నాడు.