టాలీవుడ్ లో సీన్ రివర్స్ … ఎందుకంటే !

February 15, 2017 at 5:35 am
BHA_8136

టాలీవుడ్‌లో ఈ యేడాది ఆరంభం గ్రాండ్‌గా స్టార్ట్ అయ్యింది. జ‌న‌వ‌రిలో వ‌చ్చిన ఖైదీ నెంబ‌ర్ 150 – గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి – శ‌త‌మానం భ‌వ‌తి సినిమాలు సూప‌ర్ హిట్ అయ్యాయి. జ‌న‌వ‌రి 26న వ‌చ్చిన ఒక్క ల‌క్కున్నోడు మాత్ర‌మే ప్లాప్ అయ్యింది. ఇక ఫిబ్ర‌వ‌రి స్టార్టింగ్‌లో వ‌చ్చిన నేను లోక‌ల్ సినిమా కూడా మంచి హిట్ సొంతం చేసుకుంది. ఈ సినిమా నాని కేరీర్‌లోనే హ‌య్య‌స్ట్‌గా రూ.30 కోట్ల షేర్ సాధిస్తుంద‌ని ట్రేడ్ అంచ‌నా వేస్తోంది.

ఇక ఒక్క రోజు తేడాలో రిలీజ్ అయిన సింగం-3, ఓం న‌మో వేంక‌టేశాయ సినిమాల విష‌యానికి వ‌స్తే ఈ రెండు సినిమాల్లో షాకింగ్‌గా త‌మిళ సినిమా అయిన సింగం-3కు త‌మిళ‌నాట ఆద‌ర‌ణ లేదు కాని తెలుగులో మాత్రం బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఈ సినిమాను మాస్ జ‌నాలు బాగా ఆద‌రిస్తున్నారు. ఈ సినిమా ఇప్ప‌టికే రూ.10 కోట్ల షేర్‌కు చేరువ‌వుతోంది.

వీకెండ్ దాటాక కూడా సింగం-3 బాగా ర‌న్ అవుతోంది. ఇక భ‌క్తిర‌స చిత్రం ఓం న‌మో వేంక‌టేశాయ‌కు ఆశించిన స్పంద‌న రావ‌డం లేదు. క‌నీసం 40 శాతం టిక్కెట్లు కూడా తెగ‌డం లేద‌ట‌. రెండో వారంలో ఈ సినిమా థియేట‌ర్ల‌లో ర‌న్ అవ్వ‌డం క‌ష్ట‌మే అంటున్నారు. ఇక నేను లోక‌ల్ రెండో వారంలో కూడా చాలా చోట్ల స్ట‌డీగా ర‌న్ అవుతోంది. మూడో వారంలోను ఈ సినిమాకు చాలా థియేట‌ర్లు ఉండ‌నున్నాయి.

ఇక వ‌చ్చే వారం రానా ఘాజి సోలోగా భారీ థియేట‌ర్ల‌లో రిలీజ్ కానుంది. సురేష్‌బాబుతో పాటు మిగిలిన వాళ్లు థియేట‌ర్లు కూడా ఘాజికి భారీగా ద‌క్క‌నున్నాయి. ఏదేమైనా ఈ యేడాది అంద‌రు పెద్ద హీరోల‌కు బాగా క‌లిసొచ్చినా నాగార్జున‌కు…అది కూడా భ‌క్తిర‌స‌చిత్ర‌మైన ఓం న‌మో వేంక‌టేశాయ‌కు క‌లిసి రాక‌పోవ‌డం విచిత్ర‌మే.

టాలీవుడ్ లో సీన్ రివర్స్ … ఎందుకంటే !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share