నందమూరి “మనం”.. ఆ సంబరం ఎంతో దూరంలో లేదు

February 20, 2018 at 12:30 pm
Nandamuri manam, NTR, kalyan ram, harikrishna, multi starer

టాలీవుడ్‌లో నంద‌మూరి ఫ్యామిలీకి ఉండే క్రేజ్ గురించి చెప్ప‌క్క‌ర్లేదు. నంద‌మూరి హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే ఆ రోజు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర, నంద‌మూరి అభిమానుల్లో పెద్ద పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొంటోంది. అయితే ఇప్పుడు నంద‌మూరి ఫ్యామిలీలో హీరో హ‌రికృష్ణ ఆయ‌న కుమారులు ఇద్ద‌రూ ఎన్టీఆర్‌, క‌ళ్యాణ్‌రామ్ ఇప్పుడు ఓకే సినిమాలో క‌నిపించ‌నున్నార‌న్న వార్త బ‌య‌ట‌కు రావ‌డం అంద‌రిలోనూ పెద్ద జోష్ నింపుతోంది.

 

నంద‌మూరి ఫ్యామిలీలో ఇద్ద‌రు హీరోలో క‌లిసి న‌టిస్తే చూడాల‌ని ఆ ఫ్యామిలీ అభిమానులు, టీడీపీ వీరాభిమానులు, టాలీవుడ్ సినీజ‌నాలు ఎప్ప‌టి నుంచో వెయిట్ చేస్తున్నారు. ఇక తాజా విష‌యానికి వ‌స్తే నంద‌మూరి హీరో క‌ళ్యాణ్‌రామ్ ప్ర‌స్తుతం ఎం.ఎల్‌.ఏ – నా నువ్వే సినిమాల్లో న‌టిస్తున్నాడు. ఈ రెండు సినిమాల త‌ర్వాత క‌ళ్యాణ్ ప‌వ‌న్ సాధినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సినిమా చేస్తోన్న‌ సంగతి తెలిసిందే. 

 

ఫాంటసీ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారు. ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్ స్వయంగా తన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల నిర్మాత‌గా జై ల‌వ‌కుశ సినిమాతో సూప‌ర్ హిట్ కొట్టిన క‌ళ్యాణ్ ఇప్పుడు మ‌రోసారి త‌న సినిమాను తానే ప్రొడ్యూస్ చేసుకోనున్నాడు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ తండ్రి హరికృష్ణ, సోదరుడు ఎన్టీఆర్ ఇద్దరూ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నార‌ట‌. ఏదేమైనా ముగ్గురు నంద‌మూరి హీరోలు ఒకేసారి స్క్రీన్ మీద క‌నిపిస్తే ఆ మ‌జానే వేరు.

 

నందమూరి “మనం”.. ఆ సంబరం ఎంతో దూరంలో లేదు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share