నాని+నంద‌మూరి హీరో కాంబో సినిమా 

నేచుర‌ల్ స్టార్ నాని ఏడు వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్నాడు. తాజాగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన నిన్ను కోరి సినిమా నాని అక్కౌంట్‌లో వ‌రుస‌గా ఏడో విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఇదిలా ఉంటే నంద‌మూరి హీరో క‌ళ్యాణ్‌రామ్ ఒకవైపు హీరోగా నటిస్తూనే, మరోవైపు ఇతర హీరోలతో సినిమాలు నిర్మిస్తుంటాడు.

త‌న తాన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై సినిమాలు తీస్తోన్న క‌ళ్యాణ్ గతంలో మాస్‌మహారాజ్‌ రవితేజ హీరోగా ‘కిక్‌-2’ సినిమా నిర్మించాడు. ఈ సినిమా డిజాస్ట‌ర్ అయ్యి క‌ళ్యాణ్‌రామ్ భారీ న‌ష్టాలు మిగిల్చింది. ఇక ఇప్పుడు త‌న త‌మ్ముడు యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా జై ల‌వ‌కుశ సినిమాను నిర్మిస్తున్నాడు. రిలీజ్‌కు ముందే మంచి హైప్ తెచ్చుకున్న ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లోను భారీ రేట్ల‌కు అమ్ముడుపోయింది.

ఇక ఇప్పుడు ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో క‌ళ్యాణ్‌రామ్ ఇత‌ర హీరోల‌తో వ‌రుస‌గా సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న నానితో కూడా ఓ సినిమా చేయబోతున్నాడట. నాని ప్రస్తుతానికి చాలా బిజీగా ఉన్నాడు. మూడు సినిమాలు కమిటై ఉన్నాడు. ఈ మూడు సినిమాల త‌ర్వాత క‌ళ్యాణ్‌రామ్ సినిమా చేస్తాడ‌ని తెలుస్తోంది.