‘న‌న్ను దోచుకుందువ‌టే’ ప్రీమియ‌ర్ షో టాక్‌

September 21, 2018 at 9:17 am

విడుదల తేదీ: 21 వ సెప్టెంబర్, 2018
దర్శకుడు: ఆర్ఎస్ నాయుడు
మ్యూజిక్ డైరెక్టర్: బి. అజనీష్ లోక్‌నాథ్‌
కొరియోగ్రఫీ: సురేష్ రాగుటు
నిర్మాత: సుధీర్ బాబు
న‌టీన‌టులు: సుధీర్ బాబు, న‌భా న‌టేష్‌

సుధీర్ బాబు క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న నిర్మించిన చిత్రం న‌న్ను దోచుకుందువ‌టే. ` అమ్మ పేరు మీద తీసిన సినిమా ఇది. ఎలా ఉంటుందోన‌ని టెన్ష‌న్‌గా ఫీల‌య్యాను. కానీ అవుట్ పుట్ చూసిన త‌ర్వాత చాలా సంతోషం క‌లిగింది. ద‌ర్శ‌కుడు ఆర్ఎస్ నాయ‌కుడికి ఇది తొలి సినిమానే అయినా ఎంతో అనుభ‌వ‌జ్ఞుడిగా చిత్రాన్ని తెర‌కెక్కించారు. హీరోగానే కాకుండా నిర్మాత‌గా ఆయ‌న చెప్పిన క‌థ‌కు ఫిదా అయ్యాను` ప్రీ రిలీజ్ వేడుక సంద‌ర్భంగా హీరో సుధీర్‌బాబు ఉద్వేగంతో చెప్పిన మాట‌లివి. అయితే.. ఈనెల 21 విడుద‌ల అయిన ఈ సినిమా ప్రీమియ‌ర్ షో టాక్ చూస్తే.. సుధీర్‌బాబు న‌మ్మకం ఎంత‌మేర‌కు నిజ‌మైంది.. ఆర్ఎస్ నాయుడు సుధీర్‌బాబు అంచ‌నాల‌ను అందుకున్నాడా లేదా.. అని తెలిసిపోతుంది.

Nannu-Dochukunduvate-Offici

న‌న్ను దోచుకుందువ‌టే సినిమాది రోటీన్ క‌థ‌నే అయినా.. కాస్త భిన్నంగా తెర‌కెక్కించార‌నే చెప్పుకోవ‌చ్చు. నిగూఢ‌మైన హాస్యం.. భావోద్వేగ స‌న్నివేశాలే ఈ సినిమాకు బ‌లంగా క‌నిపిస్తున్నాయి. ఇక కార్తీక్‌గా సుధీర్‌బాబు. మేఘ‌న‌గా హీరోయిన్ న‌భా న‌టేష్ ప్రేక్ష‌కుల‌ను మెప్పించార‌నే టాక్ వినిపిస్తోంది. అయితే.. క‌థ‌లో వ‌చ్చే స‌న్నివేశాల‌ను బ‌ట్టి ముందుముందు ఏం జ‌రుగుతుందో ఊహించే అవ‌కాశం ఉన్నా.. వాటిని చూపించిన విధానం బాగుంద‌నే మాట ప్రేక్ష‌కుల్లో వినిపిస్తోంది. ముఖ్యంగా ఫ‌స్టాఫ్‌లో ఫ‌టాఫ‌టా హాస్య‌భ‌రిత‌,తండ్రి (నాజర్) కార్తీక్ ల మధ్య వచ్చే సీన్స్ బాగానే పండాయి, అలాగే ఇంటర్వెల్ కు ముందు నాజర్ ఆరోగ్యం విషమించడం అసలు ట్విస్ట్ గా మారుతుంది. ఉద్వేగ‌భ‌రిత స‌న్నివేశాల‌తో సాగిన క‌థ‌.. సెకండాఫ్‌లో మాత్రం.. స‌న్నివేశాల‌ను ఆగిఆగి లాగార‌నే ఫీలింగ్ క‌లుగుతుంది.

అయితే.. ఇందులో మేఘ‌న‌, ఆమె త‌ల్లి మ‌ధ్య వ‌చ్చే ఓ భావోద్వేగ స‌న్నివేశం మాత్రం ద‌ర్శ‌కుడికి ప్ర‌తిభ‌కు నిద‌ర్శ‌న‌మే టాక్ వినిపిస్తోంది. స్ట్రిక్ట్ మేనేజ‌ర్‌గా సుధీర్‌బాబు కొత్త‌గా క‌నిపించార‌నే చెప్పుకోవ‌చ్చు. ఇక సుధీర్‌బాబు, న‌భా న‌టేష్ మ‌ధ్య సాగే ప్రేమ స‌న్నివేశాలు ఎలాంటి ట్విస్ట్‌లు లేకుండా అంతంత మాత్రంగానే ఉన్నాఆక‌ట్టుకునేలా ఉన్నాయ‌నే టాక్ వ‌స్తోంది. మొత్తంగా ఈ సినిమాలో పాట‌లు కూడా ఫ‌ర‌వాలేద‌ని అనిపిస్తున్నాయి. అయితే.. మంచి సినిమానే గానీ.. క‌మ‌ర్షియ‌ల్ హిట్టు కొడుతుందో లేదోన‌నే టాక్ వ‌స్తోంది. ఏదేమైనా.. హీరోగా.. నిర్మాత‌గా వ్య‌వ‌హరించిన‌ సుధీర్‌బాబుకు ఈ సినిమా కీల‌క‌మ‌నే చెప్పాలి. చివ‌రిగా.. ఈ సినిమాకు న‌న్ను దోచుకుందువ‌టే అని పేరు ఎందుకు పెట్టారో తెలుసుకోవాలంటే మాత్రం తెర‌పై చూడాల్సిందే.

చివ‌రిగా.. మ‌న‌సు దోచుకున్నా.. మ‌నీ వ‌చ్చేనా…పూర్తి రివ్యూ కోసం ‘తెలుగు జర్నలిస్ట్’ లో చూడండి

‘న‌న్ను దోచుకుందువ‌టే’ ప్రీమియ‌ర్ షో టాక్‌
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share