‘నన్ను దోచుకుందువటే’ మూవీ రివ్యూ & రేటింగ్

September 21, 2018 at 3:52 pm

నటీనటులు: సుధీర్ బాబు, నభా నటేష్, నాజర్, పృథ్వీ, తులసి, సుదర్శన్, వైవా హర్ష, జీవా, జబర్దస్త్ వేణు
సంగీతం: అజనీష్ లోక్ నాథ్
ఛాయాగ్రహణం: సురేష్ రగుతు
నిర్మాత: సుధీర్ బాబు
రచన – దర్శకత్వం: ఆర్.ఎస్.నాయుడు

టాలీవుడ్ లోకి సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా మహేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆయన అల్లుడు సుదీర్ బాబు ‘ఎస్ ఎంఎస్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకు ఎన్ని సినిమాల్లో నటించిన ‘ప్రేమ కథాచిత్రమ్’ రీసెంట్ గా ‘సమ్మెహనం’ సినిమాలు మాత్రమే పేరు తీసుకు వచ్చాయి. స్వ‌త‌హాగా బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్‌. అయినా న‌ట‌న మీద ఆయ‌న‌కు ఉన్న ఆస‌క్తి తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సుధీర్ బాబు. ఇక ఆయన సొంతగా సధీర్ బాబు ప్రొడక్షన్ స్థాపించిన విషయం తెలిసిందే. ఈ ప్రొడక్షన్ లో తొలి సినిమాగా ‘న‌న్ను దోచుకుందువ‌టే’సినిమాతో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే హాస్యభరిత సినిమాగా ఉంటుందని మొదటి నుంచి అంచనాలు పెరుగుతూ వచ్చాయి.

maxresdefault

కథ :
కార్తిక్ (సుధీర్‌బాబు) సాఫ్ట్ వేర్ ఇండ‌స్ట్రీలో ప‌నిచేస్తుంటాడు. యు.ఎస్‌.వెళ్లాల‌న్న‌ది అత‌ని గోల్‌. మొదటి నుంచి తన పని తాను సీరియస్ గా చేస్తూ పక్కవాళ్లు కూడా పనిలో తనలాగా ఉండాలని ఆఫీస్ లో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు. సాఫ్ట్ వేర్ పరంగా తనకు ఏ టార్గెట్ ఇచ్చినా సింపుల్ గా సెట్ చేస్తుంటాడు. ప్రేమ, పెళ్లిపై పెద్దగా ధ్యాస ఉండదు. ఆ సమయంలో అతడికి మరదలితో పెళ్లి చేయాలని చూస్తాడు తండ్రి (నాజర్). కానీ, తన మరదలు వేరే అబ్బాయితో ప్రేమలో ఉందని తెలిసి.. ఈ పెళ్లి తప్పించడానికి తాను ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు అబద్ధం చెబుతాడు కార్తీక్. తాను ప్రేమించే సాఫ్ట్ వేర్ అమ్మాయి మేఘ‌న (న‌భా న‌టేష్‌)ని ప‌రిచ‌యం చేస్తాడు. మేఘ‌న ఓ వైపు కాలేజీ చ‌దువుతూ మ‌రోవైపు షార్ట్ ఫిల్మ్స్ లో యాక్ట్ చేస్తుంటుంది. ఈ క్రమంలో ఆమె కార్తీక్ కు దగ్గరవుతుంది. కార్తీక్ కూడా ఆమెను ఇష్టపడతాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరూ తమ ప్రేమను వ్యక్తం చేయరు. ఇంతలోనే వారు దూరమయ్య పరిస్థితి వస్తుంది. మ‌రి ఈ ఇద్ద‌రూ క‌లిశారా లేదా? అమెరికా వెళ్లాల‌న్న కార్తీక్ ల‌క్ష్యం ఏమైంది? త‌దిత‌ర విష‌యాల‌తో మిగ‌తా సినిమా సాగుతుంది.

dc-Cover-e23kb0lgqc5m0475o9akc1ffh0-20180629223518.Medi

విశ్లేష‌ణ‌ :

ఈ మద్య కాలంలో సుధీర్ ఫ్యామిలీ తరహా సినిమాలు చేస్తూ..తన కెరీర్ ని సరిదిద్దుకోవడానికి చూస్తున్నాడు. రిసెంట్ గా ‘సమ్మోహనం’ కూడా ఈ తరహా సినిమా కావడం విశేషం. ప్రేమ‌, కుటుంబ భావోద్వేగాల‌తో కూడిన ఓ సున్నితమైన క‌థ ఇది. దానికి త‌గు పాళ్ల‌లో హాస్యాన్ని జోడించే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు. అనుకోకుండా పరిచయమై ప్రేమలో పడే ఒక జంట.. వారి మధ్య అపార్థాలు.. ఆపై ఇద్దరూ కలిసిపోయే ఒక సగటు కథతోనే ఇది తెరకెక్కింది. కొత్త దర్శకుడే అయినా ఎక్కడా తడబడకుండా..ఫ్యామిలీ ఎంట్రటైన్ మెంట్ గా తీర్చిదిద్దాడు. ఐటీ ఆఫీస్‌లో ఉద్యోగులు, అందులో స్ట్రిక్ట్ బాస్ వ్య‌వ‌హారం వంటి నేప‌థ్యం చ‌క్క‌టి వినోదాన్ని పంచుతుంది. క‌థానాయిక ఎంట్రీ ఇచ్చాక ఆ వినోదం మ‌రో స్థాయిలో పండుతుంది. కాలక్షేపానికి ఢోకా లేదనిపించే ఈ చిత్రం ప్రత్యేకమైన అనుభూతినైతే కలిగించదు. కొత్తదనం లేని కథ.. అక్కడక్కడా కొంచెం నెమ్మదిగా సాగే కథనం దీనికి మైనస్ అయ్యాయి. ఈ సినిమాలో కార్తీకే కాదు.. నిజ జీవితంలోనూ చాలా మంది యువ‌త త‌మ‌కు ఏం క‌వాలో, దేనికోసం ప‌రుగులు పెడుతున్నారో అర్థం కాకుండా హ‌డావిడి ప‌డుతున్నారు. అలాంటి వారికి క‌నెక్ట్ అయ్యే సినిమా ఇది. కాకపోతే..ఊర మాస్ డ్యాన్సులు, పాట‌లు, ఫైట్లు వంటివి ఎదురుచూస్తే మాత్రం చిత్రం నిరుత్సాహ‌ప‌రుస్తుంది. నిర్మాణ విలువ‌లు బావున్నాయి. పాట‌లుగానీ, నేప‌థ్య సంగీతం గానీ పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు. ఐతే ప్రి క్లైమాక్స్ తండ్రీ కొడుకుల మధ్య సెంటిమెంటు మాత్రం బాగా పండింది. నాజర్ తన అనుభవంతో ఈ ఎపిసోడ్ ను నిలబెట్టారు. ఓవరాల్ గా చెప్పాలంటే ‘నన్ను దోచుకుందువటే’ టైంపాస్ చేయడానికి ఓకే అనిపించే ఒక సింపుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్.

నటీనటులు:
సుధీర్‌బాబు, న‌భా న‌టేష్‌లు వాళ్ల పాత్ర‌ల్లో ఒదిగిపోయి చ‌క్క‌టి అభిన‌యం ప్ర‌ద‌ర్శించారు. భావోద్వేగాలు లోలోన దాచుకుని పైకి చాలా టఫ్ గా కనిపించే పాత్రలో సుధీర్ మెప్పించాడు. సుధీర్‌బాబు సొంత ప్రొడ‌క్ష‌న్ హౌస్ పెట్టి చేసిన సినిమా అని అన‌గానే అంద‌రికీ ఆస‌క్తి వ‌చ్చేసింది. థియేట‌ర్ల‌లో సీట్లు కూడా కాసింత నిండుగానే క‌నిపించాయి. సుధీర్‌బాబు ట‌ఫ్ బాస్‌గా బాగానే చేశాడు. హీరోయిన్ పాత్ర అనుక్షణం `బొమ్మ‌రిల్లు`లోని హాసినిని గుర్తు చేసింది. చివర్లో వచ్చే సెంటిమెంటు సీన్లో మినహాయిస్తే సుధీర్ బాబు అంతటా బాగానే చేశాడు. షార్ట్ ఫిలింలో నటించే నటించే సీన్లో అతడి నటన బాగా నవ్విస్తుంది. హీరోయిన్ నభా నటేష్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. నాజ‌ర్ హీరోకి తండ్రిగా, తుల‌సి హీరోయిన్‌కి త‌ల్లిగా భావోద్వేగాలు పండించారు. సుద‌ర్శ‌న్‌, వేణు, వైవా హ‌ర్ష త‌దిత‌రులు ప‌రిధి మేర‌కు చ‌క్క‌టి హాస్యం పండించారు. నభా ప్రేక్షకులపై బలమైన ముద్రే వేస్తుంది..ఇంకా ఈ హీరోయిన్ నటనను ఎలివేట్ చేయొచ్చు అన్న అభిప్రాయంలో ఉన్నారు ప్రేక్షకులు. నాజర్ కనిపించేది తక్కువ సన్నివేశాల్లోనే అయినా తన అనుభవం చూపించారు. ముఖ్యంగా ప్రి క్లైమాక్స్ లో ఆయన నటన గుర్తుండిపోతుంది. తులసి కూడా బాగానే చేసింది.

6c648ed9f63b152a19d851db595aecc0

సాంకేతిక వర్గం:
సాంకేతికంగా సినిమా మెజారిటీ విభాగాల్లో ఉత్త‌మంగా అనిపిస్తుంది. పాట‌ల ప‌రంగా కాస్త లోటు అనిపించినా, నేప‌థ్య సంగీతం విష‌యంలో మాత్రం అజ‌నీష్ బాగానే ప‌నితీరు క‌న‌బ‌రిచాడు. కాకపోతే..ఒక్క పాట కూడా గుర్తుంచుకునేలా లేదు… కొన్ని చోట్ల మరీ లౌడ్ గా అనిపిస్తుంది. సురేష్ ర‌గుతు కెమెరా ప‌నిత‌నం బాగుంది. ఎడిటింగ్‌పై మ‌రికాస్త దృష్టిపెట్టాల్సింది. ద్వితీయార్థంలో చాలా స‌న్నివేశాలు సాగ‌దీత‌గా అనిపించ‌డం సినిమాకి మైన‌స్‌గా మారింది. ఇక ఆర్.ఎస్.నాయుడు సిచ్యువేషనల్ కామెడీతో తాను ఈ ట్రెండుకు తగ్గ దర్శకుడినని చాటాడు. అతను హడావుడి లేకుండా సటిల్ గా కామెడీ పండించిన విధానం ఆకట్టుకుంటుంది. ఆయ‌న చూసిన షార్ట్ ఫిల్మ్‌ల వాతావ‌ర‌ణాన్ని ఈ సినిమాలో చ‌క్క‌గా వినియోగించుకున్నాడు. క‌థ, క‌థ‌నాల ప‌రంగా కూడా చాలా స్ప‌ష్ట‌త‌తో తాను అనుకొన్న‌ది తెర‌పైకి తీసుకొచ్చాడు. తొలి ప్ర‌య‌త్నం ప‌రంగా చూస్తే ఆయ‌న ద‌ర్శ‌కుడిగా మంచి ప‌నితీరును క‌న‌బ‌రిచిన‌ట్టే.

మైనస్ పాయింట్స్ : క‌థ‌లో కొత్త‌దనం లేదు, సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌
ప్లస్ పాయింట్స్: హీరో నటన, కెమెరా వ‌ర్క్‌,కామెడీ,సాంకేతిక విలువ

బాటమ్ లైన్ : ‘నన్ను దోచుకుందువటే’… అందరి మనసు దోచింది

రేటింగ్ : 3/5

‘నన్ను దోచుకుందువటే’ మూవీ రివ్యూ & రేటింగ్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share