డీజే సినిమా వ‌సూళ్ల‌పై నాని పంచ్‌..!

నేచుర‌ల్ స్టార్ నాని చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో ప్ర‌కంప‌న‌లు రేపుతున్నాయి. నాని అంటేనే కాంట్ర‌వ‌ర్సీల‌కు దూరం. నాని ఏం మాట్లాడినా అది ఎవ్వ‌రిని నొప్పించ‌లేదు. అయితే ఇప్పుడు నాని చేసిన వ్యాఖ్య‌లు ఇండ‌స్ట్రీలో కొంద‌రికి సూటిగానే త‌గిలాయా ? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

నాని తాజా చిత్రం నిన్ను కోరి. నివేద థామ‌స్ నానికి జంట‌గా న‌టించిన ఈ సినిమా ఈ శుక్ర‌వార‌మే థియేటర్ల‌లోకి వ‌స్తోంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో నానికి మీడియా ప్ర‌తినిధుల నుంచి ఓ ప్ర‌శ్న ఎదురైంది. మిమ్మ‌ల‌ను ఇంకా మినిమం గ్యారెంటీ హీరో కిందే లెక్కేస్తున్నారుగా అని ప్ర‌శ్నించారు. ఈ ప్ర‌శ్న‌కు కాస్త ఫైరైన నాని సినిమా బాగుంటేనే వ‌సూళ్ల గురించి మాట్లాడండి ? ఇటీవ‌ల సినిమా బాగోపోయినా వ‌సూళ్ల గురించి మాట్లాడుతున్నారు…ఇది నాకు న‌చ్చ‌ద‌ని చెప్పాడు. సినిమా బాగుంటేనే క‌దా ప్రేక్ష‌కులు సినిమా చూసేందుకు థియేట‌ర్ల‌కు వ‌స్తారంటూ అస‌హ‌నం ప్ర‌ద‌ర్శించాడు.

నాని చేసిన వ్యాఖ్య‌లు రీసెంట్‌గా రిలీజ్ అయిన బ‌న్నీ డీజే సినిమా గురించే అన్న టాక్ ఇండ‌స్ట్రీలో జోరుగా స్ప్రెడ్ అవుతోంది. ఇటీవ‌ల రిలీజ్ అయిన బ‌న్నీ డీజే సినిమాకు ఓపెనింగ్స్ బాగానే ఉన్నా త‌ర్వాత సినిమాలో ద‌మ్ము లేక‌పోవ‌డం, రిపీటెడ్ ఆడియెన్స్ లేక‌పోవ‌డంతో ఆ త‌ర్వాత సినిమా తేలిపోయింది.

అయితే డీజే టీమ్ మాత్రం త‌మ సినిమా ఫ‌స్ట్ వీక్‌లోనే రూ.100 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్టేసింద‌ని, ఎన్నో రికార్డులు కొల్ల‌గొట్టేస్తోందంటూ ఒక్కటే ప్ర‌చారం ఊద‌ర‌గొట్టేస్తోంది. అస‌లు ఈ సినిమా వ‌సూళ్ల‌పై చాలా సందేహాలే ఉన్నాయి. ఈ టైంలో నాని డీజే సినిమా వ‌సూళ్ల‌ను టార్గెట్‌గా చేసుకునే ఈ పంచ్ వేశాడ‌ని అంటున్నారు.