‘నవాబ్ ’ రివ్యూ& రేటింగ్

September 27, 2018 at 5:30 pm

నటీనటులు : అరవింద్‌ స్వామి, శింబు, అరుణ్‌ విజయ్‌, విజయ్‌ సేతుపతి, ప్రకాష్‌ రాజ్‌
దర్శకత్వం : మణిరత్నం
నిర్మాత : మణిరత్నం, ఏ సుధాకరన్‌
సంగీతం : ఏఆర్‌ రెహమాన్

భారతీయ చలన చిత్ర రంగంలో మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో వచ్చే సినిమాలకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. గతంలో ఆయన తీసిని సినిమాలు ఇప్పటికీ మరువలేని విధంగా చరిత్ర సృష్టించాయి. రోజా, గీతాంజలి,ముంబాయి ఇలా ఎన్నో సినిమాలు ఎప్పటికీ మర్చిపోలేని విధంగా ఉంటాయి. లవ్, సెంటిమెంట్, ఎమోషన్స్, మాఫియా ఏ తరహా సినిమా అయినా ఆయన స్టైల్ వేరే ఉంటుంది. అయితే గత కొంత కాలంగా మణిరత్నం తీస్తున్న సినిమాలు మాత్రం కమర్షియల్ హిట్ కావడం లేదు. దాంతో మరోసారి మాఫియా నేపథ్యంలో ‘నవాబ్’ సినిమాతో అభిమానుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో ముఖ్యపాత్రలో అలనాటి అందగాడు అరవింద్‌ స్వామి నటించగా..మిగతా పాత్రల్లో విజయ్ అరుణ్, శింబు, ప్రకాశ్ రాజ్, జ్యోతి, విజయ్ సేతుపతి నటిస్తున్నారు. ఈ రోజు థియేటర్లో రిలీజ్ అయిన ‘నవాబ్’ రివ్యూ ఎలా ఉందో చూద్దామా..

కథ:
భూపతిరెడ్డి(ప్రకాశ్‌ రాజ్‌) రాష్ట్ర రాజకీయాలనే శాసించే మాఫియా లీడర్‌. బయటకు పెద్ద మనిషాల ఉండే..భూపతి రెడ్డి వల్ల జరిగిన నష్టానికి ఎంతో మంది శత్రువులు తయారవుతారు..అందులో ముఖ్యమైన వాడు చిన్నప్ప గౌడ్‌(త్యాగరాజన్‌). ఒకరోజు పోలీస్ వేశంలో భూపతి రెడ్డి, ఆయన భార్య (జయసుధ) పై ఎటాక్ చేస్తారు..దాంతో ప్రాణాపాయ స్థితిలో ఐసీయూలో చేరుతారు భూపతిరెడ్డి. అదృష్టం కొద్ది కొద్ది రోజుల్లోనే భూపతి ఆరోగ్యంగా బయట పడతాడు. ఇక ముగ్గురు కొడుకులు పెద్ద కొడుకు వరద (అరవింద్‌ స్వామి) గ్యాంగ్‌ స్టార్‌గా తండ్రి తరువాత ఆ స్థానం కోసం ఎదురుచూస్తుంటాడు. రెండో కొడుకు త్యాగు (అరుణ్ విజయ్‌) దుబాయ్‌లో.. మూడో కొడుకు రుద్ర(శింబు) సెర్బియాలో వ్యాపారాలు చేస్తుంటారు. వరద స్నేహితుడు రసూల్‌(విజయ్‌ సేతుపతి) ఓ కేసు కారణంగా సస్పెండ్‌ అవుతాడు. రసూల్‌ని కూడా వరద తనకు సహాయంగా ఉంచుకుంటాడు. ఇదే సమయంలో భూపతి అనుకోకుండా గుండె పోటుతో చనిపోతాడు. అయితే తండ్రి అంత్య క్రియలకు రాలేదని త్యాగు పై కోపం తెచ్చుకుంటాడు వరద. అదే సమయంలో త్యాగు ఇంట్లో పోలీస్‌ సోదాలు జరుగుతాయి. బ్రౌన్‌ షుగర్‌ దొరకడంతో .. పోలీసులు త్యాగు భార్య రేణు(ఐశ్వర్య రాజేష్‌)ను అరెస్ట్‌ చేస్తారు. మరోవైపు రుద్ర ప్రేమికురాలు.. ఛాయ(డయానా ఎర్రప్ప)ను ఎవరో చంపేస్తారు. దాంతో ఇదంతా చేపిస్తుంది తన అన్న వరద అని ఇద్దరు భావిస్తారు..దాంతో అన్నపై పగ తీర్చుకునేందుకు ఇండియా వస్తున్న నేపథ్యంలో వీరికి కొత్త చిక్కులు వచ్చిపడతాయి…అన్నదమ్ముల మద్య ఆదిపత్య పోరు మొదలవుతుంది. ఈ పోరాటంలో ఎవరు గెలిచారు..? అన్నదమ్ముల మధ్య వచ్చిన విబేదాలేంటి?ఎవరు మిగిలారు..? అన్నది తెరపై చూస్తే తెలుస్తుంది.

విశ్లేషణ :
మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో సినిమా అంటే గన్‌ఫైర్స్‌, పోలీసులు, గ్యాంగ్‌స్టర్స్‌ మధ్య ఎన్‌కౌంటర్స్‌ అనే కాన్సెప్టే ఉంటుంది. కానీ ఈ సినిమా తీసింది దర్శకులు మణిరత్నం..ఆయన మార్కు వేరే ఉండేలా సినిమా కవర్ చేశారు. లవ్, ఎమోషన్స్, సెంటిమెంట్ తో పాటు ప్రతికారం..వ్యూహ ప్రతివ్యూహాలు..ఆదిపత్యం పోరు అన్నీ మేళవించి తీశారు. ముగ్గురు అన్నదమ్ముల మధ్య జరిగే గొడవనను తెరకెక్కించే ప్రయత్నం చేశారు. అందులో పోలీసుల ప్రమేయం ఎంత ఉంటుందనేదే కథ. కానీ పోలీసుల ప్రయత్నం అనే చిన్న పాయింట్‌ను చివరి వరకు చూపించకుండా మేనేజ్‌ చేయడంలో మణిరత్నం సక్సెస్‌ అయ్యారు. ఓపెనింగ్‌లోనే భూపతి రెడ్డి మీద ఎటాక్‌, తరువాత ఇతర పాత్రల పరిచయం, ఎటాకర్స్ కోసం వేట లాంటి సీన్స్‌తో ఫస్ట్ హాఫ్ రేసీగా సాగుతుంది. అయితే ఆ వేగం ద్వితీయార్థంలో మిస్‌ అయ్యిందని చెప్పొచ్చు. గతంలో సినిమాలతో పోల్చుకుంటే కాస్త డిఫరెంట్ గా తీసినా..మణిరత్నం కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయినట్లు కనిపిస్తుంది. నాయకుడు వంటి ఓ మాఫియా లీడర్‌ కథకు కొనసాగింపుగా ఈ కథ అనిపిస్తుంది. అయితే అన్నదమ్ముల మధ్య పోటీ అనేది ఎలా ఉంటుంది..అనేది చాలా స్పష్టంగా అద్భుతంగా చూపించడంలో సక్సెస్ అయ్యారు మణిరత్నం.

నటీనటులు:
మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలో ప్రకాశ్ రాజ్ మరోసారి తన అద్భుతన నటన ప్రదర్శించారు..మాఫియా డాన్ గా భూపతి రెడ్డి పాత్ర చాలా బాగా ఎలివేట్ చేశారు. ఒకప్పుడు రొమాంటిక్ హీరో అయిన అరవింత్ స్వామి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత విలన్ పాత్రల్లో నటిస్తున్నారు. మాఫియా లీడర్ గా ఎదగాలని పాత్రలో అరవింద్ స్వామి అద్భుతంగా నటించాడు. తమ్ముళ్ల పాత్రలో ఆదిపత్య పోరులో విజయ్ అరుణ్, శింబులు కూడా బాగా నటించారు. జయసుధ, అరవిందస్వామి, జ్యోతిక, అరుణ్‌ విజయ్‌, ఐశ్వర్య రాజేశ్‌, శింబు, విజయ్‌సేతుపతి ఇలా అందరూ నటన పరంగా వంద శాతం న్యాయం చేశారు. వాళ్ల నటన గురించి కొత్తగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు.

సాంకేతికవర్గం :
మాఫియా నేపథ్యంలో కొనసాగే సినిమా కావడంతో కాస్త ర్యాష్ గా ఉండేలా చూశాడు దర్శకులు మణిరత్నం. ఫైట్స్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకున్నారు. అన్నదమ్ముల మధ్య పోటీ అనేది ఎలా ఉంటుంది..గతంలో ఆయన తీసిన మాఫియా తరహా సినిమాలకు ఇది కాస్త భిన్నంగానే ఉంది. సంతోష్‌ శివన్‌ సినిమాటోగ్రఫి, శ్రీకర్‌ ప్రసాద్ ఎడిటింగ్ ఇలా టాప్‌ టెక్నిషియన్స్‌ పనిచేసినా.. ప్రేక్షకులకు మణిరత్నం మార్క్‌ మిస్‌ అయిన ఫీలింగ్ మాత్రం కలుగుతుంది. ముఖ్యంగా గ్యాంగ్‌ వార్స్‌ సన్నివేశాలు చాలా సాధాసీదాగా అనిపిస్తాయి. ఇక రెహమాన్‌ ట్యూన్స్‌ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ట్యూన్స్‌ సరిగ్గా లేవు. నేపథ్య సంగీతం బావుంది.

ప్లస్ పాయింట్స్ :నటీనటులు, కథనంలో ట్విస్టులు, సంగీతం

మైనస్ పాయింట్స్: సెకండ్ ఆఫ్ సాగదీయడం, కథలో కొత్తదనం లేదు, మాఫియా బ్యాక్‌డ్రాప్‌ మిస్

బాటమ్ లైన్ : ‘నవాబ్’లో మణిరత్నం మార్క్ మిస్

రేటింగ : 2.5/5

‘నవాబ్ ’ రివ్యూ& రేటింగ్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share