” నేను లోక‌ల్ ” ఫ‌స్ట్ వీక్ వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్స్‌

February 12, 2017 at 6:53 am
Nenu-Local-Audio-Launch-Stills-05

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘నేను లోకల్’ ఫ‌స్ట్ షో నుంచే ఫుల్ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. సంక్రాంతికి శ‌త‌మానం భ‌వ‌తి సినిమాతో హిట్ కొట్టిన దిల్ రాజు ప‌ది హేను రోజుల‌కే నేను లోక‌ల్ సినిమాతో మ‌రో హిట్‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. నేను లోక‌ల్ సినిమా ఫ‌స్ట్ వీకెండ్ ముగిసినా కూడా స్ట‌డీ వ‌సూళ్లు సాధిస్తూ ఫ‌స్ట్ వీక్ ముగిసే టైంకే లాభాల బాట ప‌ట్టేసింది.

రెండో వారంలో కూడా చెప్పుకోద‌గ్గ థియేట‌ర్లు ఉండ‌డంతో ఈ సినిమా మ‌రిన్ని లాభాల‌ను త‌న ఖాతాలో వేసుకోవ‌డం క‌న్‌ఫార్మ్ కానుంది. అయితే ఈ వీక్‌లో సింగం-3, ఓం న‌మో వేంకటేశాయ సినిమాల పోటీని త‌ట్టుకుని నిల‌బ‌డాల్సి ఉంది.

నేను లోక‌ల్ ఫ‌స్ట్ వీక్ ఏరియా వైజ్ క‌లెక్ష‌న్స్ :

నైజాం – 7.10 కోట్లు

సీడెడ్ – 2.20 కోట్లు

ఉత్తరాంధ్ర – 2.45 కోట్లు

కృష్ణా – 1.30 కోట్లు

తూర్పు గోదావరి – 1.62 కోట్లు

పశ్చిమ గోదావరి – 1.01 కోట్లు

నెల్లూరు – 0.58 కోట్లు

గుంటూరు – 1.31 కోట్లు

————————————-

ఏపీ+ తెలంగాణ – 17.57 కోట్లు

————————————-

రెస్టాఫ్ ద వరల్డ్ – 0.80 కోట్లు

యూఎస్ఏ – 3.01 కోట్లు

రెస్టాఫ్ ఇండియా -0.10 కోట్లు

————————————-

మొత్తం వసూళ్లు – 21.48 కోట్లు

————————————-

ఈ సినిమ టోట‌ల్ ప్రి రిలీజ్ బిజినెస్ రూ.17 కోట్ల వ‌ర‌కు జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. ఈ లెక్క‌న చూస్తే నేను లోక‌ల్‌కు మామూలు లాభాలు రాలేదు.

 

” నేను లోక‌ల్ ” ఫ‌స్ట్ వీక్ వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్స్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share