షాకింగ్ కాంబో…ఎన్టీఆర్‌-రాంచ‌ర‌ణ్‌-త్రివిక్ర‌మ్‌

February 22, 2017 at 6:41 am
NTR RAMCHARAN

మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ తేజ్ ఇటు హీరోగా, అటు బిజ‌నెస్‌మేన్‌గా రాణిస్తూనే త‌న తండ్రి రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబ‌ర్ 150తో నిర్మాత‌గా కూడా మారాడు. చిరు 150వ సినిమా ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాను త‌న కొణిదెల బ్యాన‌ర్‌లో నిర్మించి టాలీవుడ్ హిస్ట‌రీలోనే తిరుగులేని హిట్ కొట్టాడు. ఈ క్ర‌మంలోనే చెర్రీ త‌న బ్యాన‌ర్‌పై వ‌రుస‌గా సినిమాలు నిర్మించేందుకు ప్ర‌ణాళిక‌లు వేసుకుంటున్నాడు.

చిరు 151వ సినిమా ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి సైతం చరణ్‌ కొణిదెల ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పైనే ఉంటుంది. ఈ సినిమాను సురేందర్‌ రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే, చరణ్‌ తన మూడో సినిమా ద్వారా ఓ అరుదైన కాంబినేషన్‌కు శ్రీకారం చుట్టబోతున్నాడని ఫిల్మ్‌నగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ హీరోగా కొణిదెల బ్యాన‌ర్‌లో మూడో సినిమా తెర‌కెక్క‌నుంద‌ట‌. టాలీవుడ్ సినీజ‌నాలు ఎప్ప‌టి నుంచో ఆస‌క్తితో వెయిట్ చేస్తోన్న ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ సినిమా కూడా ఇదే అంటున్నారు. సో అటు కొణిదెల బ్యాన‌ర్‌లో నంద‌మూరి హీరో త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్ అంటే ఆ సినిమాకు మామూలు క్రేజ్ ఉండ‌దు క‌దా..!

ఇక చెర్రీ ఇదే బ్యాన‌ర్‌లో అక్కినేని హీరో అఖిల్‌తో పాటు మ‌రో యంగ్ హీరో శ‌ర్వానంద్ హీరోగా కూడా ఓ సినిమా తెర‌కెక్కించేందుకు స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు స‌మాచారం.

 

షాకింగ్ కాంబో…ఎన్టీఆర్‌-రాంచ‌ర‌ణ్‌-త్రివిక్ర‌మ్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share