పూరి-సీనియర్ హీరోయిన్ బంధం కొత్త ట్విస్ట్

February 16, 2017 at 7:11 am
puri

టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జగన్నాథ్ – సీనియ‌ర్ హీరోయిన్ ఛార్మీ బంధం గురించి ఇండ‌స్ట్రీలో ర‌క‌ర‌కాల వార్త‌లు గ‌త కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి. జ్యోతిల‌క్ష్మి సినిమా త‌ర్వాత ఈ రూమ‌ర్లు చాలా ఎక్కువ‌య్యాయి. ఆ త‌ర్వాత వ‌రుస ప్లాపులు రావ‌డంతో పూరి త‌న ఆఫీస్‌లోని టీంను మొత్తం మార్చేశాడు. వాళ్ల‌లో అల‌స‌త్వం రావ‌డంతో పాటు కొత్త‌ద‌నం కోసం టీంను మార్చిన‌ట్టు పూరి చెప్పాడు.

అయితే పూరి-ఛార్మీ బంధం గురించి వాళ్లే అంద‌రికి లీకులు ఇస్తుండ‌డంతో పూరి సీరియ‌స్ అయ్యి వాళ్ల‌ను తీసేశాడ‌న్న మ‌రో ప్ర‌చార‌మూ జ‌రిగింది. ఆ త‌ర్వాత ఛార్మీని కూడా పూరి త‌న చాయ‌ల‌కు రానివ్వ‌డం లేద‌న్న టాక్ వ‌చ్చింది. అయితే అదంతా అబ‌ద్ధ‌మే అని తేలిపోయింది.

పూరి జగన్నాథ్‌ సినిమాలకి కాస్టింగ్‌ డైరెక్టర్‌గాను, పూరికి దిశా పటానిని పరిచయం చేసింది, ఇజం చిత్రంలో ఫిమేల్‌ ఆర్టిస్టులని సెలక్ట్‌ చేసిందీ ఛార్మినే అంటూ వార్తలొచ్చాయి. ఈ వార్త‌ల‌ను అటు పూరి, ఇటు ఛార్మి ఇద్ద‌రూ  ఎవ్వ‌రూ ఖండించ‌లేదు. ఇప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే పూరి తాజా చిత్రం ‘రోగ్‌’ పబ్లిసిటీ వ్యవహారాలన్నీ ఛార్మి కనుసన్నల్లోనే జరుగుతున్నాయట.

పబ్లిసిటీ విషయంలో ఛార్మికి సర్వాధికారాలు ఇవ్వాలని పూరి నిర్మాత మనోహర్‌కి చెబితే ఆయన కాదనకుండా ఆమెకి పబ్లిసిటీ బడ్జెట్‌తో పాటు కొందరు మనుషుల్ని కూడా అప్పగించాడట. ఏదేమైనా పూరి-ఛార్మీ బంధం పెవికాల్‌గా పెన‌వేసుకుపోయింద‌న్న టాక్ ఇండ‌స్ట్రీలో వినిపిస్తోంది

పూరి-సీనియర్ హీరోయిన్ బంధం కొత్త ట్విస్ట్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share