ఆ దెబ్బ‌తో విజ‌య్ నోటా మాట‌రావ‌డం లేద‌ట‌

October 9, 2018 at 11:22 am

పాపం.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌! భాక్సీఫీస్ వ‌ద్ద భారీ షాక్‌..! జ‌నం నోటా మీట నొక్క‌డం లేదు.. ఆయ‌నకు `నోటా` మాట రావ‌డం లేదట‌. బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్లు ఉసూరుమ‌నిపించాయి. దీంతో మాంచి దూకుడు మీదున్న యంగ్ త‌రంగ్‌కు నోటా రూపంలో ముకుతాడు పడింది. వ‌రుస విజ‌యాల‌తో ముందుకెళ్తున్న‌ ఆయ‌నకు హ్యాట్రిక్ విజ‌యం మాత్రం ద‌క్క‌లేదు. అర్జున్‌రెడ్డి, గీత‌గోవిందం సినిమాల‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్లు కొట్టిన ఆయ‌నకు నోటా సినిమా చేదు అనుభ‌వాన్నే మిగిల్చింది. అదేమిటోగానీ.. ఈ సినిమాకు మొద‌టి నుంచీ కొన్ని అడ్డంకులు ఎదుర‌య్యాయి. ఆగిఆగి విడుద‌ల చేశారు. కానీ.. ఏం లాభం.. అంచ‌నాలు మించినా.. వ‌సూళ్లు మాత్రం ముంచాయి.

Threat-for-Vijay-Devarakonda-Nota-Movie-1538645545-1355

ఎలాంటి అంచ‌నాలు లేకుండా వ‌చ్చిన అర్జున్‌రెడ్డి సినిమా రూ.25కోట్లు రాబ‌ట్టింది. ఇక గీత‌గోవింద కూడా ఏకంగా రూ.66కోట్లు వ‌సూలు చేసింది. అయితే.. నోటా సినిమా విడుద‌ల అయిన మొద‌టి రోజు రూ.7.5కోట్లు రాబ‌ట్టింది. ఇక శ‌నివారం, ఆదివారం క‌లిపి మొత్తం కేవ‌లం రూ.75ల‌క్ష‌లే వ‌సూల‌య్యాయి. దీంతోనే అర్థం చేసుకోవ‌చ్చు స‌నిమా ప‌రిస్థితి ఎలా ఉందో. సాధార‌ణంగా శ‌నివారం నాడు ఎక్కువ క‌లెక్ష‌న్లు వ‌చ్చి.. ఆదివారం రాకుంటే.. ఆ సినిమాను అట్ట‌ర్ ఫ్లాప్‌గా చెబుతారు. ఇప్పుడు నోటా సినిమా కూడా ఈ జాబితాలోకి వెళ్లింది. అంటే మొత్తంగా ఇప్ప‌టివ‌ర‌కు ఈ సినిమా కేవ‌లం రూ.8.2కోట్లు మాత్ర‌మే వ‌సూలు చేయ‌డం గ‌మ‌నార్హం.

నిజానికి.. ఆ మొద‌టి రోజు కూడా విజ‌య్ దేవ‌ర‌కొండ ఇమేజ్‌ను ద‌`ష్టిలో పెట్టుకునే ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు ప‌రుగులు తీశారు. గ‌తంలో బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకున్న ప‌లువురు అగ్ర‌హీరోలు స‌హితం ఇలా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తాప‌డిన వారే. కాక‌పోతే.. ఇక్క‌డ ఒక్క విష‌యం మాత్రం స్ప‌ష్ట‌మైంది. క‌థ‌నే హీరో.. క‌థా గ‌మ‌న‌మే విజ‌య‌మంత్రం… హీరోల ఇమేజ్ సినిమా విజ‌యంలో ఏమాత్రం ప‌ని చేయ‌ద‌నే విష‌యం మ‌రోమారు రుజువు అయింది. హీరోల‌తో సంబంధం లేకుండా.. చిన్నాపెద్దా అనే భేదం లేకుండా.. క‌థ బాగుంటే.. న‌డిపించిన తీరు కొత్త‌గా ఉంటే ప్రేక్ష‌కులు ఎప్పుడు కూడా త‌మ హ‌`ద‌యాల్లో చోటు క‌ల్పిస్తారు. బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టిస్తారు. నోటా విజ‌య్ దేవ‌ర‌కొండ ఏం నేర్చుకుంటారో చూడాలి మ‌రి.

ఆ దెబ్బ‌తో విజ‌య్ నోటా మాట‌రావ‌డం లేద‌ట‌
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share