NTR అభిమానులకి సారి :కొరటాల

నందమూరి యుంగ్ టైగర్ NTR నటిస్తోన్న క్రేజీ సినిమా జనతా గారేజ్ రిలీస్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకి ఇది చేదు వార్తే.ముందుగా ప్రకటించినట్టు ఈ సినిమా ఆగస్ట్-12 న రిలీస్ కావడం లేదని సినిమాను సెప్టెంబర్-2 వ తేదీన రిలీస్ చేయనున్నట్టు ప్రకటించారు.అసలే సినిమా టీజర్ ఇప్పటికే ఎన్నో సంచలనాలు సృష్టిస్తోంది.టీజర్ రిలీజ్ అయిన తరువాత అభిమానుల అంచనాలు మరింతగా పెంచేసింది.ఇటు తెలుగులోనే కాకుండా అటు మలయాళం లోనూ పలు సంచలనాలు నమోదు చేస్తోంది ఈ సినిమా.

ఈ సందర్బంగా కొరటాల శివ NTR అభిమానులందరికి క్షమాణ చెప్పాడు.ఎక్కడా రాజీ పడకుండా అత్యుత్తమ సాంకేతిక విలువలతో సినిమాను అందించడం కోసం,పోస్ట్ ప్రొడక్షన్ లో తగిన సమయం కేటాయించటం కోసమే తప్పనిసరి పరిస్థితుల్లో సినిమాని వాయిదా వేయాల్సి వచ్చిందని కొరటాల శివ తెలిపారు.ఇంత చక్కటి కథ,NTR ఎంతో అద్భుతంగా నటించిన సినిమాకి సాంకేతికంగా ఎటువంటి లోటు ఉండ కూడదనే ఈ నిర్ణయమన్నారు.కొంచెం లేట్ అయినా లేటెస్ట్ గా వస్తామంటోంది చిత్ర యూనిట్ మొత్తం.