తారక్ ‘అరవింద సమేత’ నుండి పూజా హెగ్డే అవుట్

June 8, 2018 at 5:27 pm
Pooja Hegde

‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్ లో కెరీర్ స్టార్ట్ చేసిన పూజా హెగ్డే ‘లో’ హిట్ రేట్ తో దూసుకు పోతుంది. అసలు చెప్పుకోవాలంటే ఈ భామ చేసిన సినిమాలలో దువ్వాడ జగన్నాధం సినిమా ఒక్కటే కాస్త ఆడింది, రంగస్థలం హిట్ అయినా ఆ సినిమాలో ఒక్క ఐటమ్ సాంగ్ మాత్రమే చేసింది. ఇలా ఈ భామ టాలీవుడ్ లో పయనం సాగిస్తుంది…ఇలాంటి సందర్భంలో ఎన్టీఆర్ లాంటి టాప్ హీరో పక్కన భామకు ఆఫర్ వచ్చేసింది ఇంకేముంది పూజా ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎటువంటి హిట్ నోచుకోని పూజాకు ఇలాంటి భారీ ఆఫర్ రావడమేంటో కాస్త ఆశ్చర్యంగానే ఉంది, ఇదే కాకుండా మహేష్ 25 వ సినిమలో కూడా ఛాన్స్ కొట్టేసింది ఈ భామ.

ఇక అసలు మ్యాటర్ కు వస్తే తారక్- ఎన్టీఆర్ సినిమా అరవింద సామెత మొదటి షెడ్యూల్ పూర్తి అయింది . త్రివిక్రమ్ పూజాకు సంబందించిన షెడ్యూల్స్ అన్ని ముగుంచేసాడట, ఇక పూజాకు ఎన్టీఆర్ సినిమాతో మొత్తం పని అయిపోయినట్టే. ఈ సినిమా తరువాత పూజాకు డెహ్రాడూన్ , బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా సాక్ష్యం, మహేష్ సినిమా, అలాగే ప్రభాస్ తో ఒక లవ్ స్టోరీ సినిమా లైన్ లో ఉన్నాయ్. ఈ లెక్కన చోస్తుంటే అమ్మడు చాల బిజీగానే ఉంది, ఏదైనా పూజా చాల లక్కీ అనే చెప్పాలి….ఎందుకంటే కెరీర్ ప్లాపులతో స్టార్ట్ చేసి టాప్ హీరోల పక్కన ఛాన్స్ కొట్టేయడం అంటే మాటల.

తారక్ ‘అరవింద సమేత’ నుండి పూజా హెగ్డే అవుట్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share