ఎన్టీఆర్ తో తలపడనున్న ఆ నలుగురు హీరోలు

July 11, 2018 at 4:42 pm
NTR, Aravinda Sametha veera raghava, ram hello guru premakosame, on dussera festival race

టాలీవుడ్ లో టెంపర్ సినిమా నుంచి మొన్నటి జై లవకుశ సినిమా వరకు వరుస విజయాలతో దూసుకు పోతున్నాడు ఎన్టీఆర్. ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత వీర రాఘవ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఎలాంటి గ్యాప్స్ లేకుండా రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. దసరా టార్గెట్ పెట్టుకునే షూటింగ్ మొదలుపెట్టారు. అందు కోసం ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా షూటింగ్ జరుపుకుంటున్నారు. అయితే ఈ చిత్రం రిలీజ్ అక్టోబర్ 11 అని అనుకుంటున్నట్లు ఫిలిమ్ వర్గాల టాక్.

ఒకవేళ అదే జరిగినతే..మరి ఆ సమయంలో ఎవరైనా పోటీ ఉంటారా..అంటే ఉంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. జనతా గ్యారేజ్ రిలీజ్ తరహాలో ఈసారి జూనియర్ ఫైట్ సోలోగా ఉండే ఛాన్స్ లేదు. అదే రోజు అని కాదు కానీ ముందు వెనుక హైప్ ఉన్న సినిమాల క్యూ చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంది. అందులో స్ట్రెయిట్ సినిమాలతో పాటు డబ్బింగ్ వెర్షన్లు వస్తాయని వార్తలు వస్తున్నాయి.

pandemkodi2

ఈ నేపథ్యంలో విశాల్ పందెం కోడి 2 దసరాకు తెస్తానని అభిమన్యుడు సక్సెస్ మీట్ లో ప్రకటించేసాడు కాబట్టి అందులో మార్పు ఉండకపోవచ్చు. రామ్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో త్రినాథ రావు దర్శకుడిగా రూపొందిన హలో గురు ప్రేమ కోసమే కూడా దసరాకే ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక శీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న అమర్ అక్బర్ ఆంటోనీ డేట్ ని సెప్టెంబర్ చివరి వారానికి ఫిక్స్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి కాని ఏ మాత్రం ఆలస్యం జరిగినా అక్టోబర్ కు వెళ్ళిపోతుంది.

658904-amar-akbar-anthony

HGPK

ఇక పిదా, తొలిప్రేమ సినిమాలతో మంచి విజయం అందుకున్న వరుణ్ తేజ్ అంతరిక్షం(వర్కింగ్ టైటిల్)సైతం ఆ సీజన్ మీదే కన్ను వేసింది. సవ్యసాచి కంటే ముందు శైలజారెడ్డి అల్లుడు విడుదలయితే ఆటోమేటిక్ గా ఇది అక్టోబర్ నే టార్గెట్ చేసుకుంటుంది. సో….ఇన్ని సినిమాలో దసరా టార్గెట్ చేసుకొని ఉన్నాయి..మరి ‘అరవింద సమేత వీర రాఘవ’రిలీజ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

varun-tej-new-film-antariksham_b_0706180123

ఎన్టీఆర్ తో తలపడనున్న ఆ నలుగురు హీరోలు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share