అర‌వింద స‌మేతంగా బాల‌య్య వ‌స్తారా..?

September 8, 2018 at 4:31 pm
NTR, Aravindha Sametha, Audio Function, Chief guest, Balakrishna

అబ్బ‌ర పులి అని ఒక‌డంటే.. తోక బారెడు ఉంద‌ని మ‌రొక‌డు అన్నాడ‌ట‌.. ఇప్పుడు తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో ఇలాగే ఓ పుకారు షికారు చేస్తోంది. సోష‌ల్ మీడియా పుణ్యాన అదికాస్తా.. వైర‌ల్ అవుతోంది. జూనియ‌ర్ ఎన్టీఆర్‌, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో అర‌వింద స‌మేత రాఘ‌వ సినిమా దూసుకొస్తున్న విష‌యం తెలిసిందే. ద‌స‌రా నాటికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు చిత్ర‌యానిట్ చ‌క‌చ‌కా ప‌నులు చేస్తున్నారు. దాదాపుగా చిత్రీక‌ర‌ణ కూడా పూర్తి కావొస్తోంది. ఈ నెల‌లోనే ఆడియో ఫంక్ష‌న్ చేసేందుకు కూడా స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. త్వ‌ర‌లోనే టాకీ పార్ట్ పూర్తి చేసి, మిగిలిన ఆ ఒక్క పాట‌ను కూడా మ‌రో వారం రోజుల్లో చిత్రీక‌రించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

39391319_662188874137101_2836372316101804032_o

ఇదంతా రొటీన్ ముచ్చ‌టేగానీ.. ఇక విష‌యానికి వ‌స్తే.. ఎన్టీఆర్‌- త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న అర‌వింద స‌మేత సినిమాలో బాబాయ్ ముచ్చ‌ట వ‌స్తోంది. ఏమిటా విష‌యం అంటే మీరు ఈ క‌థ‌నం చ‌ద‌వాల్సిందే మ‌రి. ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ మ‌ధ్య‌లో బాల‌య్య బాబు.. ఇప్పుడు ఇదే విష‌యం ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. కొద్దిరోజులుగా అర‌వింద స‌మేత రాఘ‌వ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్ష‌న్‌కు బాల‌య్య వ‌స్తున్నారంటూ సోష‌ల్ మీడియాలో పుకారు షికారు చేస్తోంది. ఎన్టీఆర్ స్వయంగా త్రివిక్రమ్, నిర్మాత రాధాకృష్ణతో కలిసి బాబాయి బాలకృష్ణ వద్దకు వెళ్లి ‘అరవింద సమేత’ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంలో పాల్గొనాల‌ని కోరార‌ని.. అందుకు బాల‌క‌`ష్ణ కూడా ఒకే చెప్ప‌డ‌మే కాకుండా.. ఈనెల 20న ఆడియో విడుద‌ల చేయాల‌ని ఆయ‌నే సూచించార‌నే టాక్ వినిపిస్తోంది. ఈ విష‌యం హాట్ టాపిక్‌గా మార‌డానికే చాలానే కార‌ణాలు ఉన్నాయి.

41310796_2318970858340931_6454302592720699392_n

నిజానికి.. బాబాయ్‌.. అబ్బాయ్ మ‌ధ్య ఎప్పుడు స‌న్నిహిత సంబంధాలు ఉంటాయో.. ఎప్పుడు ఉండ‌వో ఎవ‌రూ చెప్ప‌లేని ప‌రిస్థితి. గ‌తంలో వీరిమ‌ధ్య నెల‌కొన్నవివాదాలు ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే ఎన్టీఆర్ అభిమానులు మాత్రం బాల‌య్య‌తో క‌ల‌డాన్ని కొంత ఇబ్బందిగానే భావిస్తున్నారు. కానీ.. ఇటీవ‌ల జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ఎన్టీఆర్ తండ్రి హ‌రిక‌`ష్ణ దుర్మ‌ర‌ణం చెందిన విష‌యం తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఆ విషాదం నుంచి తేరుకుని అర‌వింద స‌మేత చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటున్నారు ఎన్టీఆర్‌. ఇలాంటి స‌మ‌యంలో పెద్ద దిక్కుగా ఉన్న బాబాయ్‌తో స‌న్నిహిత సంబంధాలు కొనసాగించ‌డమే మంచిద‌ని ఆయ‌న భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే.. ఆడియో రిలీజ్ ఫంక్ష‌న్‌కు బాల‌య్య వ‌స్తారా..? లేదా..? అన్న విష‌యంలో మాత్రం చిత్ర‌యూనిట్ కూడా క్లారిటీ ఇవ్వక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

అర‌వింద స‌మేతంగా బాల‌య్య వ‌స్తారా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share