ఆ పాట వినగానే మా అమ్మ ఏడ్చేసింది: ఎన్టీఆర్

October 7, 2018 at 12:09 pm

అర‌వింద స‌మేత‌.. ఫ‌న్‌, యాక్ష‌న్‌, ఎమోష‌న్‌ల క‌ల‌బోత‌.. ఫ్యాక్ష‌న్‌తో ఛిద్ర‌మైన బ‌తుకుల వ‌ల‌పోత‌కు అద్దం ప‌డుతుంద‌నే అంచ‌నాకు అంద‌రూ వ‌చ్చేశారు. ఈ సినిమా ట్రైల‌ర్‌, స‌న్నివేశాలు, అందులోని డైలాగ్స్ చూస్తే ఇదే విష‌యం తెలుస్తుంది.. ఫ్యాక్ష‌న్ నేప‌థ్యంలో అనేక సినిమాలు వ‌చ్చినా.. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ త‌న‌మార్క్‌ను చూపిస్తాడ‌నే టాక్ వినిపిస్తోంది. ఇక త్రివిక్ర‌మ్‌-ఎన్టీఆర్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న తొలి సినిమా కావ‌డం, ఇందులో రాయ‌ల‌సీమ కుర్రాడిగా యంగ్‌టైగ‌ర్ క‌నిపించ‌డంతో అంచ‌నాలు భారీగా పెరిగాయి. ట్రైల‌ర్‌కు మాంచి రెస్పాన్స్ వ‌స్తోంది. సిక్స్‌ప్యాక్‌లో ఎన్టీఆర్ వెటాడే సింహంలా దూసుకొస్తున్న సీన్ అభిమానులను ఊపేస్తుంది.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌ చిత్రాన్ని నిర్మించిన విష‌యం తెలిసిందే. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 11న విడుద‌ల చేసేందుకు అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ సినిమా విడుద‌ల కానుంది. ఈ సందర్భం గా మీడియాతో ముచ్చటించిన ఎన్టీఆర్ ఈ సినిమా గురించి అనేక విష‌యాల్ని పంచుకున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న కూడా ఒకింత భావోద్వేగానికి గుర‌య్యారు. ఈ సినిమా త‌న‌లో చాలా మార్పు తెచ్చింద‌ని చెప్పుకొచ్చారు. `ఈ సినిమా కథ విన్నప్పుడే నాలో చాలా మార్పు వచ్చింది. ఇందులోని పాత్రలు – వాటి ప్రవర్తనలు నాలో చాలా మార్పులే తెచ్చాయి. అది చాలా మంచి మార్పు. నా చుట్టూ ఉన్న మనుషుల్ని సంతోషంగా ఉంచే మార్పు ఇది. సంతోషమే సగం బలం అని నమ్మే పాత్ర నాది` అని ఆయ‌న వివ‌రించారు.

ఇక పెనిమిటి పాట గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్ప‌టికే ఈ పాట అంద‌రి హ‌`ద‌యాల‌ను పిండేసింది. జ‌నానికి బాగా క‌నెక్ట్ అయ్యింది. ఈ పాట ద‌గ్గ‌రికి రాగానే ఎన్టీఆర్ భావోద్వేగానికి గుర‌య్యారు. ఆ పాట‌తో త‌న అటాచ్‌మెంట్‌ను చెప్పారు. `ఈ పాట‌తో బాగా కనెక్టయ్యాం. అమ్మా నేను. నాన్నగారు చనిపోయాక ఆ పాటను తెరకెక్కించారు. ఆ పాట విన్న తర్వాత అమ్మ కంట నీరు ఆగలేదు. తను ఏడ్చేసింది. నాన్న గారు చనిపోయాక అమ్మ – నేను మెంటల్ గా ఇంకా స్ట్రాంగ్ అయ్యాం. ఆ సన్నివేశం అలాంటిది.. అందుకే ఆ పాటకు కనెక్టయ్యాం. అమ్మకు నాకే కాదు.. ఈ పాట అందరికీ కనెక్టవుతుంది` అని ఎన్టీఆర్ చెప్పారు.

ఈ క్ర‌మంలోనే రాజ‌మౌళితో మ‌ల్టీస్టార‌ర్ విష‌యం కూడా ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింది. ఆ ప్రాజెక్టు కోసం ఆత‌`త‌గా ఉన్నాన‌ని ఎన్టీఆర్ చెప్పారు. ` నాకు దానిపై ఐడియా లేదు. త్వరలోనే సెట్స్ వెళ్తుంద‌ని అనుకుంటున్నా.. దానిపైనే ఆలోచన సాగుతోంది. అదో బహుభాషా చిత్రం అవుతుంది. పాన్ ఇండియా సినిమాగా పెద్ద కాన్వాసు ఉన్న చిత్రమవుతుంది. నిజంగా దానిపై ఎంతో ఎగ్జయిటింగ్ గానూ ఉన్నాను. వెబ్‌సిరీస్‌లో అవకాశం వస్తే తప్పకుండా నటిస్తాను. అయితే నన్ను ఇంతవరకూ ఎవరూ అడగలేదు. ఛాన్స్ వస్తే ఎలా ఉంటుందో చూడాలి` అని ఆయ‌న చెప్పొకొచ్చారు. అలాగే ఇత‌ర ప్రాజెక్టుల గురించి చెబుతూ.. రాజమౌళి గారితో సినిమా. అలానే వైజయంతి మూవీస్ – అట్లీ కాంబినేషన్ లో నటించే సినిమా ఉంది. అయితే అది ఇంకా కన్ఫామ్ కాలేదు` అని ఎన్టీఆర్ వివ‌రించారు.

ఆ పాట వినగానే మా అమ్మ ఏడ్చేసింది: ఎన్టీఆర్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share