షాకింగ్: తారక్ సినిమాలో సీమ ఎపిసోడ్ చిన్నదేనా..

July 4, 2018 at 7:28 pm
NTR, Aravindha sametha, Rayala seema episode, trivikram

టాలీవుడ్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తీసిన సినిమాలు దాదాపు అన్నీ హిట్ గానే నిలిచాయి. తనదైన పంచ్ డైలాగ్స్ తో ప్రేక్షకులను రంజింప చేస్తున్నారు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో నటించడానికి ప్రతి ఒక్క హీరో ఎంతో ఉత్సాహం చూపిస్తుంటారు. అయితే ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ హీరోలతో ఎక్కువగా సినిమాలు తీసిన త్రివిక్రమ్ తాజాగా నందమూరి హీరో ఎన్టీఆర్ తో ఓ సినిమా తీస్తున్నాడు.

త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమా అరవింద సమేత వీర రాఘవ షూట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక విషయం మీద తెగ హడావుడి జరుగుతోంది. సినిమా అంతా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వుంటుంది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు వేరియేషన్స్ లో కనిపించబోతున్నాడని ఆ మద్య వార్తలు వచ్చాయి. కాలేజ్ స్టూడెంట్ గా ఓ పాత్రలో..తర్వాత సీమలోకి వచ్చిన తర్వాత యాంగ్రీ రోల్ లో కనిపిస్తారని వార్తలు వచ్చాయి.

ఇక ప్రత్యేకంగా వేరే వాళ్ల సహాయంతో త్రివిక్రమ్ డైలాగులు రాస్తున్నారు. ఎన్టీఆర్ ఆ యాసలో డైలాగులు ప్రాక్టీస్ చేస్తారు. ఇలా ఎవరి కథనాలు వారు వేస్తూ సినిమాపై అప్పుడే ఆసక్తి పెంచుతున్నారు. ఇదిలా ఉంటే..అరవింద సమేత వీర రాఘవ చాలా వరకు హైదరాబాద్ నేఫథ్యంలోనే జరుగుతుంది.

చిన్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లాంటిది మాత్రం సీమ నేపథ్యంలో వుంటుంది. రాయలసీమ సీన్లు ఉన్నా పెద్ద నిడివితో కూడుకున్నవి కావని సమాచారం. దసరా టార్గెట్ గా రెడీ అవుతున్న అరవింద సమేత సినిమా ఇప్పటికే ఆంధ్ర ఏరియా హక్కులు 40 కోట్ల రేషియోలో అమ్మేసారు. అలాగే ఓవర్ సీస్ హక్కులు ఇచ్చేసారు. ఇక నైజాం, సీడెడ్ హక్కులు ఇవ్వాల్సి వుంది.

షాకింగ్: తారక్ సినిమాలో సీమ ఎపిసోడ్ చిన్నదేనా..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share