చిరు ఫ్యాన్స్‌కు షాక్ ఇస్తోన్న బిగ్ బాస్‌

ఎన్టీఆర్ హోస్ట్ చేస్తోన్న తెలుగు బుల్లితెర కాస్ట్ లీ షో బిగ్ బాస్‌. ఈ షోకు మామూలు రోజుల్లో రేటింగ్స్ ఎలా ఉన్నా వారంతంలో ఎన్టీఆర్ ఎంట్రీ ఇస్తుండ‌డంతో రేటింగ్ టాప్ రేంజ్‌లో ఉంటున్నాయి. మామూలు రోజుల్లో నీర‌సంగా ఉంటోన్న బిగ్ బాస్ టీఆర్పీలు వారంతంలో మాత్రం బాగా పుంజుకుంటున్నాయి.

బిగ్ బాస్ షో మొత్తం మీద ఎన్టీఆర్ ఒక్క‌డే హైలెట్ అవుతున్నాడు. ఈ షో ఓన్లీ వ‌న్ అండ్ ఎన్టీఆర్ షోగా మారిపోయింద‌ని అంద‌రు హీరోల అభిమానులు, బుల్లితెర అభిమానులు ముక్త‌కంఠంతో అంగీక‌రిస్తున్నారు. అయితే ఈ డైలాగ్స్ ఇప్పుడు చిరు ఫ్యాన్స్‌కు షాక్ ఇస్తున్నాయ‌ట‌.

చిరుకు వెండితెర మీద ఎంతో క్రేజ్ ఉంది. ప‌దేళ్ల గ్యాప్ త‌ర్వాత కూడా వెండితెర మీద ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాతో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యింది. అయితే చిరు బుల్లితెర మీద చేసిన మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు షో మాత్రం అట్ట‌ర్ ప్లాప్ అయ్యింది.

ఇప్పుడు బుల్లితెర‌కు ఉన్న కోట్లాది మంది అభిమానులు బుల్లితెర‌పై ఎన్టీఆర్ సూప‌ర్ హిట్ – చిరు అట్ట‌ర్ ప్లాప్ అని వేస్తోన్న స‌టైర్ల దెబ్బ‌తో చిరు ఫ్యాన్స్‌కు దిమ్మ‌తిరిగి పోతోంద‌ట‌. మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు షోను చిరు స‌రిగా డీల్ చేయ‌లేక‌పోయారు. ఆయ‌నకు ఆ షోలో అస్స‌లు కామెడీ టైమింగ్ కుద‌ర్లేదు. ఎంత వ‌ర‌కు గాంభీర్యంతోనే షోను న‌డిపించాల‌ని ఆయ‌న చేసిన ప్ర‌య‌త్నాలు ఫెయిల్ అయ్యాయి.

దీంతో ఇప్పుడు బిగ్ బాస్ షోకు ఓవ‌రాల్ టాక్ బాగోలేక‌పోయినా హోస్ట్‌గా చిరు క‌న్నా ఎన్టీఆర్‌కు అదిరిపోయే క్రేజ్ రావ‌డం, దీంతో చిరుపై సెటైర్లు పేల‌డంతో చిరు ఫ్యాన్స్‌కు కాస్త ఇబ్బందిగానే ఉంద‌ట‌.