తేజ లేడు కాబట్టి ఇలా చేస్తే బెటర్ ఏమో బాలయ్యా

April 26, 2018 at 3:05 pm
NTR Bio pic, Balakrishna, Suggestions, director krish, ragavendra rao

నంద‌మూరి తార‌క‌రామారావు.. ఒక వ్య‌క్తి కాదు.. ఒక శ‌క్తి.. అందులో ఎన్నో పార్శ్వాలు.. మ‌రెన్నోహావాభావాలు.. అంచ‌నాల‌కు మించిన అరుదైన వ్య‌క్తిత్వం.. ఆయ‌న జీవిత ప‌య‌నాన్ని అధ్య‌య‌నం చేయ‌డానికి రోజులు కాదు.. ఏళ్లు కావాలి. మ‌రి ఇంత‌టి మ‌హోన్న‌త వ్య‌క్తి బ‌యోపిక్ తీయ‌డ‌మంటే మాట‌లా.. ! దానిని డైరెక్ట్ చేయ‌డ‌మంటే అదొక సాహ‌సం.. ఆ న‌ట‌సార్వ‌భౌముడిని, ఆంధ్రుల ఆత్మ‌గౌర‌వ ప్ర‌తీక‌ను తెర‌పై ఆవిష్క‌రించ‌డానికి గుండెల‌నిండా కొండంత ధైర్యం కావాలి.. అంత‌కుమించిన ఆత్మ‌స్థైర్యం కావాలి.. ఇప్పుడు ఇదే విష‌యం అర్థ‌మ‌యిన‌ట్లుంది ద‌ర్శ‌కుడు తేజ‌కు. తాను ఎన్టీఆర్ బ‌యోపిక్‌కు న్యాయం చేయ‌లేన‌ని త‌ప్పుకోవ‌డం అటు చిత్ర‌సీమ‌లో, ఇటు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

 

తన తండ్రి నందమూరి తారక రామారావు జీవిత కథని ‘ఎన్టీఆర్‌’ పేరుతో తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు బాలకృష్ణ. దర్శకుడిగా తేజని ఎంచుకున్నారు. ఇటీవలే ఈ చిత్రం లాంఛనంగా మొదలైంది. త్వరలో రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలు కాబోతోంది. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టు నుంచి తేజ తప్పుకున్నారు. ‘‘ఎన్టీఆర్‌కి నేను వీరాభిమానిని. ఆయన జీవిత  చరిత్రని సినిమాగా తీసే అవకాశం రావడం నా అదృష్టం. అయితే ఈ ప్రాజెక్టుకి పూర్తి స్థాయిలో న్యాయం చేయలేనేమో అనిపించింది. అందుకే ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నా’’ అని ఆయ‌న అన్నారు. ఈ చిత్రానికి కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. 

 

పూరి జగన్నాథ్‌, క్రిష్‌, కృష్ణవంశీ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. మరి బాలకృష్ణ ఎవరిని సంప్రదిస్తారో చూడాలి.అయితే ఈ ప‌రిస్థితి ఎందుకు ఏర్ప‌డింద‌న్న‌దే అంద‌రి మెద‌ళ్ల‌ను తొలుస్తుంది. నిజానికి ఎన్టీఆర్‌ను ట‌చ్ చేయడం మామూలు విష‌యం కాదు.. ఆయ‌న జీవితాధారంగా అనేక సీక్వెల్స్ తీసేయొచ్చు. కానీ.. బ‌యోపిక్ విష‌యంలో అటు బాల‌య్య బాబు, ఇటు ద‌ర్శ‌కుడు.. నిర్మాత ఇలా అంద‌రూ తొంద‌ర‌ప‌డ్డార‌నే విష‌యం ఇప్పుడు స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఎన్టీఆర్ బ‌యోపిక్‌ను తేజ డైరెక్ట్ చేస్తున్నార‌ని చెప్పిన‌ప్పుడే ఇది సాధ్య‌మేనా అనే అనుమానాలు వ‌చ్చాయి. 

 

ఇప్పుడదే విష‌యం నిజ‌మైంది. లోలోప‌ల కార‌ణాలు ఏమున్నా.. బ‌య‌ట‌కు మాత్ర ఇదే విష‌యం కనిపిస్తోంది. ఎన్టీఆర్‌తో అనేక సినిమాలు తీసిన‌, ఆయ‌న‌లోని అనేక పార్శ్వాల్ని ద‌గ్గ‌రినుంచి చూసిన రాఘ‌వేంద్ర‌రావు లాంటి ద‌ర్శ‌కుడిని వ‌దిలి తేజ డెరెక్ట్ చేయ‌డ‌మేమిట‌నే వాద‌న వ‌చ్చింది. ఎన్డీఆర్‌ను చూపించ‌డ‌మంటే ఇప్ప‌టి స్టైల్లో కాదుక‌దా.. అప్ప‌టి స్టైల్లోనే చూపించాల‌న్న విష‌యాన్ని అందరూ మ‌రిచిపోయార‌నే టాక్ వినిపిస్తోంది. 

 

ఇక బాల‌య్య‌ను 17వ శతాబ్దం నాటి రాజు అయిన గౌతమీపుత్ర శాత‌క‌ర్ణిగా ఓ రేంజ్‌లో చూపించి తిరుగులేని గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సినిమా తీసిన క్రిష్ లాంటి వాళ్ల‌కు అయినా ఈ ప్రాజెక్ట్ ఇస్తే బాగుంటుంద‌న్న మ‌రో టాక్ కూడా వ‌స్తోంది. అలాగే వీరిద్దరి మధ్య మంచి రిలేషన్ ఉంది ఈ లెక్కలో బాలయ్య అడిగితే క్రిష్ కాదంటాడా , ఒక వేల తీస్తానన్న ఇప్పుడు హిందిలో మణికర్ణిక సినిమా తీస్తున్నాడు కాబట్టి అది అయ్యాకైనా క్రిష్ బయోపిక్ తియ్యడానికి రెడీ అవుతాడు. ఏదైనా ఇప్పుడున్న టెక్నీకాల్ వాల్యూస్ కి క్రిష్ ఒక్కడే రీచ్ కాగలడనేది ఫ్యాన్స్ ఆలోచన.  ఏదేమైనా బ‌యోపిక్‌ను తీయ‌డానికి మ‌రింత స‌మ‌యం తీసుకుని, మ‌రింత‌ అధ్య‌యనం చేసి, అప్ప‌టి.. ఇప్ప‌టి త‌రానికి వార‌ధిగా ఉన్న డైరెక్ట‌ర్‌ను బాల‌య్య ఎంచుకుంటేనే మంచిద‌నే టాక్ వినిపిస్తోంది. 

 

తేజ లేడు కాబట్టి ఇలా చేస్తే బెటర్ ఏమో బాలయ్యా
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share