‘ఎన్టీఆర్’లుక్ అదిరిపోయింది!

July 5, 2018 at 7:20 pm
NTR Bio Pic, New look, Shooting start, Director Krish

ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ‌ ప్రతిష్టాత్మకంగా ‘ఎన్టీఆర్’బయోపిక్ ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి మొదట తేజ అనుకున్నా..ఆయన ప్లేస్ లో క్రిష్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే క్రిష్ పూర్తిగా స్క్రిప్ట్ రెడీ చేసుకొని నేటి నుంచి రెగ్యూలర్ షూటింగ్ మొదలు పెడుతున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

మ‌హాన‌టి త‌ర్వాత జనాలు ఎక్కువ ఆస‌క్తి చూపుతున్న బ‌యోపిక్ ఎన్టీఆర్‌. తొలిసారి ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ప్రమాణస్వీకారం చేసిన జనవరి 9న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో బాల‌య్య 64 పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నాడు. తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని మూవీ మేకర్స్ భావిస్తున్నారు.

తొలి షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీతో పాటు రామ కృష్ణా థియేట‌ర్‌లో జరగనున్నట్లు సమాచారం.
క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో బాల‌య్య ప్ర‌ధాన పాత్ర పోషించ‌నుండ‌గా, ఎన్టీఆర్ స‌తీమ‌ణి బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో బాలీవుడ్ న‌టి విద్యాబాల‌న్ క‌నిపించ‌నుంది. న్నాళ్లూ ఎన్టీఆర్ బయోపిక్‌లో విద్యాబాలన్ నటిస్తుండటం కేవలం ఊహాగానం కాగా, ఇప్పుడు ఆ విషయం అధికారికంగా ధ్రువీకరణ అయ్యినట్టైంది.

మూవీ ఎప్పుడు సెట్స్‌పైకి వెళుతుందా అని అభిమానులు ఎంతో ఆస‌క్తిక‌రంగా చూస్తుండ‌గా, నేడు మూవీని సెట్స్ పైకి తీసుకెళ్ళేందుకు స‌న్నాహాలు చేసారు చిత్ర నిర్మాత‌లు. ఈ సినిమాలో మరింత మంది స్టార్లు కనిపించబోతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ సమకాలీనులైన సెలబ్రిటీల పాత్రల్లో నేటి తరం స్టార్లు కనిపించబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఏఎన్నార్ పాత్రలో నాగచైతన్య లేదా సుమంత్, కృష్ణ‌ పాత్రలో మహేశ్ బాబు నటించబోతున్నారని ఊహాగానాలున్నాయి. వీటిపై అధికారిక ధ్రువీకరణ రావాల్సి ఉంది.

36674939_2176539035910996_1007786880273481728_o

‘ఎన్టీఆర్’లుక్ అదిరిపోయింది!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share