బ‌యోపిక్ నుంచి తేజ అవుట్‌ వెనుక అస‌లేం జ‌రిగింది

April 26, 2018 at 10:41 am
NTR Bio Pic, Teja Out, balakrishna, ragavendra rao, movie

దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ వ్య‌వ‌స్థాప‌కులు నంద‌మూరి తార‌క రామారావు జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కుతోన్న ఎన్టీఆర్ బ‌యోపిక్ ప‌ట్టాలెక్కుతుంద‌ని వార్త‌లు వ‌స్తున్న‌ప్ప‌టి నుంచి ఈ క్రేజీ ప్రాజెక్టు అనుకున్న స్పీడ్‌గా ముందుకు సాగ‌డం లేదు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ద‌ర్శ‌కుడు తేజ ఈ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకున్న‌ట్టు ప్ర‌క‌ట‌న చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.

 

ఈ క్రేజీ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకున్న తేజ ‘మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్‌కు నేను వీరాభిమానిని. ఆయన జీవితచరిత్రతో తీసే ఈ సినిమాకు నేను న్యాయం చేయలేనేమో అనే అనుమానం నాకు కలిగింది. అందుకే ఈ ప్రాజెక్టు నుంచి వైదొలగుతున్నా’ అని తేజ పేర్కొన్నారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడి పాత్రలో ఎన్టీఆర్ త‌న‌యుడు బాల‌కృష్ణ న‌టిస్తోన్న ఈ ప్రాజెక్టు కోసం బాల‌య్యే స్వ‌యంగా నిర్మాత అవ‌తారం ఎత్తారు.

 

అయితే ఇప్పుడు స‌డెన్‌గా తేజ ఈ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకోవ‌డం వెన‌క బాలయ్య‌కు తేజ‌కు మ‌ధ్య గ్యాప్ రావ‌డ‌మే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టును ప్రారంభించే ముందే తేజ మ‌రో సీనియ‌ర్ హీరో వెంక‌టేష్‌తో మ‌రో ప్రాజెక్టుకు క‌మిట్ అయ్యారు. ఈ రెండు ప్రాజెక్టుల‌ను ఏక‌కాలంలో తెర‌కెక్కించాల‌ని తేజ అనుకున్నాడు. దీనిపై అప్పుడే బాల‌య్య అసంతృప్తి వ్య‌క్తం చేసిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.

 

త‌న తండ్రి జీవిత చ‌రిత్ర‌తో తెర‌కెక్కే ప్రాజెక్టు… అందులోనూ తాను నిర్మాత‌, హీరో కావ‌డంతో ఈ టైంలో తేజ ఈ సినిమాతో పాటు మ‌రో సినిమాను కూడా స‌మాంత‌రంగా డైరెక్ట్ చేయ‌డం ఆ ఎఫెక్ట్ ఎన్టీఆర్ బ‌యోపిక్‌పై ప‌డుతుంద‌ని బాల‌య్య తేజ‌కు వార్నింగ్ కూడా ఇచ్చాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత స్క్రిఫ్ట్ కూడా బాల‌య్య అనుకున్నంత ప‌వ‌ర్ ఫుల్‌గా రాక‌పోవ‌డం, తేజ షూట్ చేసిన ఒక‌టి రెండు సీన్లు కూడా బాగా ఎలివేష‌న్ కాక‌పోవ‌డం బాల‌య్య‌కు తేజ‌పై గురి కుద‌ర‌లేద‌న్న‌ది ఇండ‌స్ట్రీ టాక్‌.

 

ఇక సంక్రాంతికే ఈ సినిమా టీజ‌ర్ క‌ట్ చేయాల‌నుకున్నారు. టీజ‌ర్ కూడా అనుకున్న‌ట్టుగా రాలేద‌ని.. అప్పుడు కూడా బాల‌య్య తేజ‌పై అసంతృప్తిగా ఉన్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఇక ఇప్పుడు ఫైన‌ల్‌గా తేజ బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. వీరిద్ద‌రి మ‌ధ్య గ్యాప్ ఉంద‌న్న‌ది నిజ‌మ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు చెపుతున్నాయి. అయితే తేజ మాత్రం తాను ఈ ప్రాజెక్టుకు న్యాయం చేయ‌లేయ‌న‌ని బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్టు చెపుతున్నారు. ఇక ఇప్పుడు కె.రాఘ‌వేంద్ర‌రావు పేరు ఈ సినిమా డైరెక్ట‌ర్ రేసులో వినిపిస్తోంది.

 

బ‌యోపిక్ నుంచి తేజ అవుట్‌ వెనుక అస‌లేం జ‌రిగింది
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share