‘ఎన్టీఆర్‌-ఏఎన్ఆర్’ ఆ ఫైట్ కు … నో ఛాన్స్!

September 21, 2018 at 1:26 pm

నంద‌మూరి తార‌క రామారావు జీవితం ఆధారంగా ఎన్టీఆర్ బ‌యోపిక్ రూపొందుతున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఇందులో ఏయే అంశాల‌ను చూపిస్తారు..? ఎక్క‌డికి ప‌రిమితం చేస్తారు..? ఆయ‌న జీవితంలో ఎదురైన పోట్లు, గాట్ల‌ను కూడా చూపిస్తారా..? లేదా..? ఎన్టీఆర్ సినీ, రాజ‌కీయ రంగంలో చెర‌గ‌ని ముద్ర వేసినా.. ఆయ‌న ఎదుర్కొన్న వెన్నుపోటు గాయం మాత్రం తెలుగు ప్ర‌జానీకాన్ని స‌లుపుతూనే ఉంది. మ‌రి ఈ ఎపిసోడ్ ఉంటుందా..? ఉండ‌దా..? ఓన్లీ ఆయ‌న జీవితంలో పాజిటివ్ అంశాల‌ను మాత్రమే చూపిస్తే.. తెలుగులోకం ఒప్పుకుంటుందా..? తిట్టుకుంటుందా..? ఇలా నిత్యం స‌వాల‌క్ష ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మవుతున్నాయి. అయితే.. ఈ విష‌యంలో ద‌ర్శ‌కుడు క్రిష్ మాత్రం ప‌క్కా క్లారిటీ తో ఉన్న‌ట్లు తెలుస్తోంది. అత్యంత క్లిష్ట‌మైన‌, అదే స‌మ‌యంలో ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన ఈ ప్రాజెక్టును జ‌నంలోకి ఎలా తీసుకుపోవాల‌న్న విష‌యం ఆయ‌న బాగా తెలుసున‌నే టాక్ వినిపిస్తోంది.

42158383_1699866466789975_2424602870742515712_n

ఇక ప‌లు సామాజిక‌, చారిత్ర‌క అంశాల‌ను జోడిస్తూ క‌మ‌ర్షియ‌ల్ హిట్టు కొట్ట‌డంలో దిట్ట అయిన క్రిష్ ఎన్టీఆర్ బ‌యోపిక్‌పై ఎప్పటిక‌ప్పుడు హైప్ క్రియేట్ చేస్తున్నారు. బ‌జ్ త‌గ్గ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డుతున్నారు. అందుకోసం సంద‌ర్భానుసారంగా పోస్ట‌ర్లు విడుద‌ల చేస్తూ అంద‌రిలో ఆస‌క్తిని మ‌రింత‌గా పెంచుతున్నారు. ఈ సినిమాలో ఏఎన్నార్ పాత్ర కూడా ఉన్న విష‌యం తెలిసిందే. ఈ పాత్ర‌లో హీరో సుమంత్ న‌టిస్తున్నారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌లు మంచి స్నేహితులు కాబ‌ట్టి.. ఈ అంశాల‌ను కూడా సినిమాలో చూపించాల‌ని క్రిష్ అనుకుంటున్నారట‌.. అయితే.. ఎన్టీఆర్‌, ఏఎన్నార్ అభిమానులు మాత్రం పోటాపోటీగా బ్యాన‌ర్లు క‌ట్టేవారు. వాల్ రైటింగ్ చేప‌ట్టేవారు. ఒకానొక ద‌శ‌లో వీరిద్ద‌రి అభిమానుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు కూడా జరిగిన దాఖాలాలు ఉన్నాయి.

కానీ.. ఎన్టీఆర్, ఏఎన్నార్‌లు మాత్రం ప్రొఫెష‌న‌ల్‌గా ముందుకు వెళ్లేవారు. ఇద్ద‌రు క‌లిసి న‌టించిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇలా చిత్రాల్లో, న‌ట‌న‌లో పోటీ ప‌డేవారు. అయితే.. ఎన్టీఆర్ సీఎం అయిన త‌ర్వాత వీరిమ‌ధ్య కొంత గ్యాప్ వ‌చ్చినా.. స్నేహ‌పూరిత వాతావ‌ర‌ణ‌మే వెల్లివెరిసింది. అయితే.. వీరిద్ద‌రి మ‌ధ్య ఉన్న వివాదాన్ని చూప‌కుండా.. కేవ‌లం స్నేహ‌పూరిత అంశాల‌నే ఈ సినిమాలో చూపించాల‌ని క్రిష్‌ అనుకుంటున్న‌ట్లు ఇండ‌స్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇందుకు త‌గ్గ‌ట్టే..తాజాగా.. ఏఎన్నార్ జ‌యంతి సంద‌ర్భంగా చిత్ర‌యూనిట్ విడుద‌ల చేసిన పోస్ట‌ర్ ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. ఇండ‌స్ట్రీలో ఉన్న టాక్‌కు ఈ పోస్ట‌ర్ బ‌లాన్ని ఇస్తోంది.

ఈ పోస్టర్ సినిమాపై మ‌రింత‌ ఆసక్తిని కలిగిస్తోంది. ఎన్టీఆర్ నోట్లో ఉన్న సిగరెట్ ను ఏఎన్నార్ వెలిగిస్తున్న ఈ పోస్టర్ వారి ఇద్దరి మద్య స్నేహంకు ప్రతి రూపంగా ఉంద‌ని సోషల్ మీడియాలో కామెంట్లే కామెంట్లు. బాలకృష్ణ, సుమంత్ లు అచ్చం ఎన్టీఆర్, ఏ ఎన్నార్‌ల లాగే ఉన్నార‌ని ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. అయితే.. ఒకే వ్య‌క్తి విభిన్న రంగాల్లో ముద్ర వేయ‌డం అరుదైన విష‌యం. మ‌రి అలాంటి ఎన్టీఆర్ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, వివాదాలు ఉన్నాయి. అందుకే వాటి ఏమాత్రం ట‌చ్ చేయ‌డ‌కుండా కేవ‌లం పాజిటివ్ అంశాల‌నే క్రిష్ తీసుకుని, వేగ‌వంతంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుతున్న‌ట్లు తెలుస్తోంది. కానీ.. వాదాల‌కంటే.. వివాదాల‌ను ఇష్ట‌ప‌డే జనం క్రిష్‌ను ఏమేర‌కు స్వీక‌రిస్తారో చూడాలి మ‌రి.

‘ఎన్టీఆర్‌-ఏఎన్ఆర్’ ఆ ఫైట్ కు … నో ఛాన్స్!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share