రిక్షా తొక్కిన ఎన్టీఆర్!

October 8, 2018 at 10:49 am

ఆ మద్య ఓ సినిమాలో కటౌట్ ఉంటే..చాలు కంటెంట్ తో పని లేదు అన్న డైలాగ్ గుర్తుంది కదా..ఇది మహానటులు నటసార్వభౌములు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) విషయంలో అక్షర సత్యం అని అంటారు. ఆయన సినిమా అంటే చాలు జనాలు వెనుకా ముందు ఆలోచించకుండా థియేటర్లకు క్యూ కట్టేవారు. అంత గొప్ప ఛరిష్మా ఉన్న మహానటులు ఎన్టీఆర్. అప్పట్లో ఎన్టీఆర్ సెట్స్ లోకి వస్తుంటే..దర్శక, నిర్మాతలు సైతం లేచి ఆయనను గౌరవించేవారట. అందరినీ బ్రదర్ అంటూ సోంబోదించే ఎన్టీఆర్ కనుచూపు సైగలతో అక్కడి వాతావరణాన్ని తన అధినంలోకి తెచ్చుకునే వారట.

Balakrishna-Rides-Rickshaw-For-NTR-Biopic-1538971848-1437

గంభీరమైన ఆ స్వరం..ఆయన పర్సనాటిలీ..చూసి అల్లంత దూరంలోనే ఆగిపోయి అచేతనుడై చూసేవారట. ఈ విషయాన్ని ఎన్టీఆర్ తో కలిసి నటించిన చలపతిరావు ఎన్నో సార్లు తన ఇంటర్వ్యూలో తెలిపారు. ఇప్పుడు అలాంటి ఛరిష్మా ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణకు వచ్చిందంటే అతిశయోక్తి లేదు. సెట్లో బాలకృష్ణ వస్తే..అందరూ లేచి ఆయనకు ఎంతో గౌరవం ఇస్తారు. అసలే ముక్కోపి..సెట్స్ లో ఆయన జోలికి వెళ్లాలన్నా..చొరవ తీసుకొని ఏదైనా మాట్లాడాలన్నా కాస్త భయపడుతుంటారట.

కానీ దర్శకుల, నిర్మాత, సహనటుల విషయంలో బాలకృష్ణ ఎంతో సౌమ్యంగా ఉంటారట. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్’ బయోక్ షూటింగ్ నడుస్తుంది. అయితే ఈ షూటింగ్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు లీక్ అవుతున్నాయి. ఎన్టీఆర్ స్టైల్లో బాలకృష్ణను చూసి అందచూ షాక్ తింటున్నారు. తాజాగా రిక్షా నడుపుతూ..ఎన్టీఆర్ స్టైల్లో నల్ల కళ్లద్దాలు పెట్టుకొని..తెల్లని ప్యాంట్ షర్టు వేసుకొని హ్యాట్ పెట్టుకొని ఉన్న బాలకృష్ణ ఫోటోలు చూసి అందరూ నిజంగా ఎన్టీఆర్ మళ్లీ వచ్చాడా అని అనుకుంటున్నారు.

హ్యాటుకు కాంబినేషన్ సెట్టయ్యిందో లేదో చూస్తున్నారా? ఇంతకీ వేటగాడు రిక్షా తొక్కే సీనా? లేక సాంగు షూటింగా? ఆ రిక్షా డెకరేషన్ కూడా అదిరిపోతుంది. ఎన్టీఆర్ ఆన్ లొకేషన్ ఎంత సందడిగా ఉండేవారో ఆ సందడి అంతా బాలయ్యలో కనిపిస్తోంది. ఎన్టీఆర్ 1 – 2 చిత్రాలు జనవరిలో రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. క్రిష్ ఈ చిత్రాలకు దర్శకత్వం వహిస్తున్నారు.

రిక్షా తొక్కిన ఎన్టీఆర్!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share