బాలయ్య టార్గెట్ 100 కోట్లా?!

July 22, 2018 at 8:40 pm
NTR Biopic, Balakrishna, Krish, 100 Crore mark, Tollywood

అవును టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ ఇప్పుడు మంచి జోష్ లో ఉన్నారు. క్రిష్ దర్శకత్వంలో బాలయ్య వందవ చిత్రం ‘గౌతమి పుత్ర శాతకర్ణి’బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఆ తర్వాత పైసా వసూల్, జైసింహ ఇలా వరుసగా సినిమాలు తీస్తున్నారు. ప్రస్తుతం క్రిష్, బాలకృష్ణ కాంబినేషన్ లో ‘ఎన్టీఆర్ బయోపిక్’ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు. నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్ర పోషిస్తుండగా – మోక్షజ్ఞ నూనూగు మీసాల నిమ్మకూరు ఎన్టీఆర్ లా కనిపించనున్నాడన్న టాక్ వినిపించింది.

`గౌతమిపుత్ర శాతకర్ణి` సినిమా 50 కోట్ల క్లబ్ లో చేరిన విషయం తెలిసిందే. ఈ మద్య స్టార్ హీరోల సినిమాలు మినిమం వంద కోట్ల క్లబ్ లో చేరుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ బయోపిక్ తో ఈ జోడీ 100కోట్ల క్లబ్ లో అడుగుపెడుతుందా? నటసింహం 100కోట్ల షేర్ తెస్తారా? ప్రస్తుతం జనంలో హాట్ టాపిక్ ఇది. కంచె, గౌతమి పుత్ర శాతకర్ణి లాంటి ప్రతష్టాత్మక సినిమాలు తెరకెక్కించిన క్రిష్ బాలీవుడ్ బ్యూటీ కంగనా రౌనత్ తో ‘మణికర్ణిక’ లాంటి చారిత్రాత్మక సినిమా తీశారు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఇకపోతే అన్నగారు ఎన్టీఆర్ కి మాస్ లో ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా `ఎన్టీఆర్` బయోపిక్ 100 కోట్ల బిజినెస్ చేయడం ఖాయమంటూ చెప్పుకుంటున్నారు.

37304192_502859180170539_4425243201799979008_n

ఈ సినిమాని 100కోట్లకు అమ్మాలని బాలయ్య- క్రిష్ బృందం పక్కాగా స్కెచ్ వేసిందన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఈ మద్య చరణ్ రంగస్థలం – మహేష్ భరత్ అనే నేను రేంజు హిట్టు కొట్టాలి. 200కోట్ల గ్రాస్ వసూలు చేసి టాలీవుడ్ రేంజ్ పెంచారు. ప్రపంచం మొత్తం తెలిసిన ఎన్టీఆర్ పై సినిమా అంటే తక్కువ అంచనా వేయలేం. పైగా బాలయ్య రేంజు 70కోట్ల గ్రాస్ పైమాటేనని `గౌతమిపుత్ర శాతకర్ణి` నిరూపించింది.

అందుకే ఈసారి 100కోట్లు కొట్టేస్తాడా? అన్న విశ్లేషణ సాగుతోంది. 2019 సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ సినిమాని నందమూరి అభిమానులే తలకెత్తుకుని అంత పెద్ద హిట్ చేస్తారేమో చూడాలి. ఈ మద్య సావిత్రి బయోపిక్ నేపథ్యంలో వచ్చిన ‘మహానటి’ సినిమా 45కోట్ల షేర్ – 80 కోట్ల గ్రాస్ వసూలు చేసిందంటే ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ అందుకు డబుల్ ట్రిపుల్ సక్సెస్ సాధించాల్సి ఉంటుంది. ఆ ఫీట్ని నటసింహం నిజం చేసి చూపిస్తారా.. అన్నది వేచి చూడాలి.

krish-to-direct-ntr-biopic

బాలయ్య టార్గెట్ 100 కోట్లా?!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share