ఎన్టీఆర్ బయోపిక్ లైన్ ఇదే…క్రిష్ మార్క్ చూపించాడు!

August 11, 2018 at 4:26 pm
NTR Biopic, Balakrishna, Krish, Story line, Movie

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకులు క్రిష్ ఎన్నో అద్భుతమైన సినిమాలు అభిమానులకు అందించారు. నందమూరి బాలకృష్ణకు వందవ సినిమా ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ తర్వాత మరో ప్రతిష్టాత్మక సినిమా అందించబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఒక్కో క్యారెక్టర్ రివీల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ ని తీసుకున్నారు.

తాజాగా టాలీవుడ్ సర్కిల్ లో ఓ విషయం బయటికి పొక్కింది, అదేంటంటే సినిమా స్టార్టింగ్ ఎన్టీఆర్ లైఫ్ గురించి బసవతారకం చెబుతారట..ఎన్టీఆర్ కి పిన్న వయసులోనే 1942 వివాహం జరిగింది. అంతే కాదు బసవతారం కు దగ్గర బంధుత్వం కూడా ఉందట ఎన్టీఆర్ కుటుంబానికి..అందుకే అతి చిన్న వయసులోనే వీరి వివాహం జరిగింది. ఆ తర్వాత ఎన్టీఆర్ ఉద్యోగం వదిలి సినిమా ఇండస్ట్రీకి రావడం…అగ్ర హీరోగా ఎదగడం ఆ తర్వాత రాజకీయాల్లో తనదైన స్టైల్ చూపించడం అన్నీ జరిగిపోయాయి.

Krish-To-Direct-NTR-Biopic

ఇదంతా బసవతారకం యాంగిల్ లో స్టోరీ టెల్లింగ్ వుంటుందని తెలుస్తోంది. అయితే బసవతారకం 1985 లో స్వర్గస్తులైనారు..అప్పటికే ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ స్థాపించడం..నాదెండ్ల వెన్నుపోటు, మళ్లీ దాన్ని అధిగమించి అధికారంలోకి రావడం జరిగిపోతాయి. ఇవన్నీ ఆమె జీవితంలో చూశారు..కనుకనే ఆమె పాత్రకు అంత ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తుంది. ఎన్టీఆర్ బయోపిక్ కేవలం మాస్ జనాలనే కాదు, అభిమానులనే కాదు, మహిళలను ఆకట్లుకోవాలి..అందుకే క్రిష్ అత్యంత నేర్పుతో ఈ సినిమా లో బసవతారం పాత్రకు పెద్ద పీట వేసినట్లు తెలుస్తుంది. అంత ప్రాధాన్యం ఉన్న పాత్ర కాబట్టి బాలీవుడ్ నటి విద్యాబాలన్ ను బసవతారకం పాత్రాలో క్రిష్ తీసుకున్నాడు. ఏది ఏమైనా క్రిష్ టేకింగ్ చాలా అద్భుతంగా ఉండబోతుంది అనటానికి బసవతారకంతో కథ నడిపేయడమే పెద్ద హైలైట్..ఇదే జరిగితే ‘ఎన్టీఆర్’మరో బ్లాక్ బస్టర్ కావడం ఖాయం.

Krish-director

ఎన్టీఆర్ బయోపిక్ లైన్ ఇదే…క్రిష్ మార్క్ చూపించాడు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share