ఎన్టీఆర్ నువ్వే చెయ్యాలి: బాలయ్య!

October 22, 2018 at 12:28 pm

క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ బ‌యోపిక్ శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుంటోంది. ఈ సినిమాను రెండు భాగాలుగా తీసుకొస్తున్న విష‌యం తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ పాత్ర‌లో బాల‌క‌`ష్ణ‌, బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో విద్యాబాల‌న్‌, హ‌రిక‌`ష్ణ పాత్ర‌లో క‌ల్యాణ్‌రామ్‌, చంద్ర‌బాబునాయుడి పాత్ర‌లో రానా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ సినిమాలో బాల‌క‌`ష్ణ పాత్ర‌లో ఆయ‌న త‌న‌యుడు మోక్ష‌జ్ఞ న‌టిస్తున్న‌ట్లు మొద‌టి నుంచీ టాక్ వినిపిస్తున్నా.. తాజాగా కీల‌క మ‌లుపు తిరిగింది. అదేమిటంటే.. బాల‌క‌`ష్ణ పాత్ర‌లో తార‌క్ క‌నిపిస్తాడ‌నే సరికొత్త టాక్ న‌డుస్తోంది. హ‌రిక‌`ష్ణ దుర్మ‌ర‌ణం త‌ర్వాత ఏర్ప‌డిన ప‌రిస్థితుల నేప‌థ్యంలో తార‌క్‌ను తీసుకుంటేనే మంచిద‌నే ఆలోచ‌న‌లో బాల‌య్య ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Jr1540122820.NTR-with-Sr.NTR-NTR-Childhood-Pics

ఇప్పుడు ఇదే అంశంలో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇక అర‌వింద స‌మేత వీర రాఘ‌వ సినిమా స‌క్సెస్ మీట్‌కు బాల‌య్య‌బాబు రావ‌డంతో ఈ ఊహాగానాలకు మ‌రింత బ‌లం చేకూరింది. నిజంగానే బాల‌క‌`ష్ణ పాత్ర‌లో తార‌క్ న‌టిస్తే.. ఇక ఎన్టీఆర్ బ‌యోపిక్‌పై మ‌రిన్ని అంచ‌నాలు పెర‌గ‌డం ఖాయ‌మ‌నే టాక్ వినిపిస్తోంది. ఇప్ప‌టికే అర‌వింద స‌మేత వీర రాఘ‌వ సినిమా విజ‌యంతో మాంచి ఊపుమీదున్న తార‌క్ ఇందుకు సానుకూలంగా ఉన్నారా..? లేదా ..? అన్న విష‌యంలో క్లారిటీ లేకున్నా.. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో బాబాయ్‌తో క‌లిసి న‌డిస్తేనే మంచిద‌నే ఆలోచ‌న‌లో ఆయ‌న ఉన్న‌ట్లు తెలుస్తోంది.

అర‌వింద స‌మేత వీర రాఘ‌వ సినిమా స‌క్సెస్ మీట్‌లో తార‌క్ మాట్లాడుతూ.. త‌న‌కు తండ్రిలా ముందుండి న‌డిపించాల‌ని బాల‌య్య‌బాబును కోరిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో బాల‌క‌`ష్ణ పాత్ర‌లో తార‌క్ న‌టించ‌డం ఖాయ‌మ‌నే వాద‌న కూడా ఉంది. అయితే… ఎన్టీఆర్ బ‌యోపిక్ రెండుభాగాలుగా వ‌స్తున్న విష‌యం తెలిసిందే. మొద‌టి భాగంలోనే బాల‌క‌`ష్ణ పాత్ర ఉంటుంద‌ని, రెండో భాగంలో డౌటేన‌నే టాక్ వినిపిస్తోంది. ఈ ఊహాగానాల‌కు తెర‌ప‌డాలంటే మ‌రికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక పోతే ‘ఎన్టీఆర్ నువ్వే చెయ్యాలి’ అన్న బాలయ్య పిలుపుకోసం నందమూరి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఏదేమైనా.. బాబాయ్‌, అబ్బాయ్ మ‌ధ్య ఉన్న గ్యాప్ సూన్యం అని తేలిపోయింది అని నంద‌మూరి అభిమానులు అంటున్నారు.

ఎన్టీఆర్ నువ్వే చెయ్యాలి: బాలయ్య!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share