ప్చ్..ఎన్టీఆర్ లో అవన్నీ మిస్ అయినట్టేనా!

November 2, 2018 at 11:06 am

రాజ‌కీయాలు మారుతున్నాయి. కొత్త‌రూపు దాల్చుతున్నాయి.. వీటికి అనుగుణంగా సినిమా స్రిప్ట్ మారుతోంది.. ఇదేంటి రాజ‌కీయాల‌కు, సినిమాల‌కు ఏం సంబంధం..? సినిమా స్రిప్ట్ ముందే సిద్ధం అవుతుంది క‌దా..? త‌రుచూ మార్చ‌డం ఏమిటి..? అనే క‌దా మీ సందేహాలు. అవును ఇప్పుడు టాలీవుడ్‌లో ప్రాజెక్టు విష‌యంలో ఇదే జ‌రుగుతుంది. ప్ర‌స్తుతం మారుతున్న రాజ‌కీయ ప‌రిణామాల‌ను అనుగుణంగా ఆ సినిమా స్రిప్ట్ మారుతుంద‌ట‌. ఇంత‌కీ ఆ సినిమా ఏద‌ని అనుకుంటున్నారా..? అది మ‌రేదో కాదు.. విశ్వ‌విఖ్యాత న‌టుడు, రాజ‌కీయ దురంధ‌రుడు ఎన్టీఆర్ బ‌యోపిక్‌. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ బ‌యోపిక్ రెండు భాగాల్లో నంద‌మూరి బాలయ్య కీ రోల్ పోషిస్తున్నారు.

39190055_2020320364686819_8928918527969067008_n

మొద‌టి భాగం ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు సంక్రాంతికి, రెండో భాగం ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడును ఫిబ్ర‌వ‌రిలో విడుద‌ల చేసేందుకు చిత్ర యూనిట్ స‌న్నాహాలు చేస్తోంది. ఏక‌కాలంలో చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుంటున్న ఈ బ‌యోపిక్‌కు ఇప్పుడు కొత్త చిక్కులు వ‌చ్చిప‌డ్డాయి. అవి కూడా రాజ‌కీయ చిక్కులు. ఎన్టీఆర్ జీవితంలో బాబుగారి వెన్నుపోటు ఎపిసోడ్‌ను ఎవ‌రూ మ‌రిచిపోరు. ఈ సినిమాలో ఆ ఎపిసోడ్ ఉండ‌దు. ఇప్పుడు తాజాగా.. ఈ బ‌యోపిక్‌లో మ‌రో ఎపిసోడ్ కూడా డౌటేన‌ని ప‌లువురు విశ్లేష‌కులు అంటున్నారు. టీడీపీ, కాంగ్రెస్ మ‌ధ్య కొత్త బంధం ఏర్ప‌డిన వేళ‌.. ఇక బ‌యోపిక్‌లో కాంగ్రెస్‌ను ఎన్టీఆర్ కాంగ్రెస్ కు ఎదురు తిరిగి తెలుగు వారి గౌరవాన్నినిలిపిన ఎపిసోడ్ క‌నిపించ‌డం క‌ష్ట‌మే మ‌రి.

45104688_2344480642232180_8739492435647791104_n

ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్ర‌బాబు, కాంగ్రెస్ అధినేత రాహుల్‌తో భేటీ కావ‌డంతో ఈ విష‌యం తేట‌తెల్లం అయింది. నిజానికి.. కాంగ్రెస్‌కు వ్య‌తిరేకంగా ఏర్ప‌డిందే తెలుగుదేశం పార్టీ. ఆనాడు ఎన్టీఆర్ కాంగ్రెస్‌ను విమ‌ర్శించిన తీవ్ర‌త సినిమాలో క‌నిపించద‌నే టాక్ వినిపిస్తోంది. దుష్ట‌కాంగీ.. లాంటి ప‌దాలు, త‌దిత‌ర అంశాలు ఇక బ‌యోపిక్‌లో క‌నిపించ‌వ‌నీ.. ఏమైనా ఉంటే కాంగ్రెస్‌ను ప్రియ‌మైన శ‌త్రువులాగానే చూపించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ప‌లువురు అంటున్నారు. అలాగే సెకండ్ పార్టీలో నాదెండ్ల ఎపిసోడ్ ఉంటుందా, ఒక‌వేళ ఉన్న‌ది ఉన్న‌ట్లు చూపిస్తే.. ఏపీలో కాంగ్రెస్‌, టీడీపీ పొత్తుల రాజ‌కీయానికి ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు ఏర్ప‌డుతాయి. అందుకే ప్ర‌స్తుతం ఎన్టీఆర్ బ‌యోపిక్ స్రిప్ట్ లో మార్పులు త‌ప్ప‌వ‌నే టాక్ వినిపిస్తోంది.

1530194743-1064

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ఎన్టీఆర్ ఆత్మ‌క‌నిపించ‌ని బ‌యోపిక్‌గానే ఈ సినిమా మిగిలిపోతుంద‌నే టాక్ వినిపిస్తోంది. ఇక్క‌డ మ‌రో విష‌యం ఏమిటంటే.. ద‌ర్శ‌కుడు క్రిష్ ఈ ప‌రిణామాల్లో క్ర‌ష్ అవుతున్న‌ట్లు స‌మాచారం. ఆయ‌న‌పై అనేక ర‌కాలుగా ఒత్తిడి వ‌స్తున్న‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలో ఆయ‌న కూడా త‌ర‌చూ స్క్రిప్ట్ మార్చ‌డంపై తీవ్ర అస‌హ‌నంతో ఉన్న‌ట్లు ఇండ‌స్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా.. ఆఖ‌రికి ఎన్టీఆర్ జీవితంలోని అస‌లైన విష‌యాలు బ‌య‌ట‌కు రాకుండా.. బ‌యోపిక్‌ను కూడా చంద్ర‌బాబు ప్ర‌భావితం చేస్తున్నాడ‌న్న‌మాట‌. దీనిని ఆంధ్రులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి మ‌రి.

ప్చ్..ఎన్టీఆర్ లో అవన్నీ మిస్ అయినట్టేనా!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share