ఎన్టీఆర్ బయోపిక్…విమర్శకుల నోరు మూపించిన క్రిష్

July 7, 2018 at 4:05 pm
NTR Biopic, First Look, Director Krish, Balakrishna, Tweet

అన్న‌గారు.. ఆంధ్రుల ఆత్మ‌గౌర‌వ ప్ర‌తీక‌.. రాజ‌కీయాల్లో విజ‌య‌గీతిక‌.. ఇంతటి ఘ‌న చ‌రిత‌గ‌ల మ‌నీషిని తెర‌పై ఆవిష్క‌రించ‌డ‌మంటే మాట‌లా… అంటే కాద‌నె చెప్పాలి. ఎన్టీఆర్ బ‌యోపిక్.. ఇది ఇద్ద‌రికి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క ప్రాజెక్టు. కీ రోల్ పోషిస్తున్న‌ బాల‌య్య‌బాబుకు ఇది వంద సినిమాల‌కు స‌మానం. ఇక ద‌ర్శ‌కుడు క్రిష్‌కు అగ్ని ప‌రీక్షే.. అన్న‌గారిని చూపించ‌డంలో ఏం తేడా వ‌చ్చినా ఆంధ్రులు అస్స‌లే ఒప్పుకోరు. అయితే.. ఈ బ‌యోపిక్‌కు సంబంధించి ఇద్ద‌రూ మొన‌గాళ్లుగానే చెప్పుకోవాలి. తెలుగు సినీలోకంలో నంద‌మూరి బాల‌క‌`ష్ణది విల‌క్ష‌ణ‌మైన పంథా. ఆయ‌న చేసిన‌న్ని పాత్ర‌లు మ‌రెవ‌రూ చేసి ఉండ‌రు. పౌరాణిక‌, ఇతిహాస పాత్ర‌ల్లో ఎన్టీఆర్ త‌ర్వాత అంత‌గా ఒదిగిపోయే ఏకైన న‌టుడు ఎవ‌రంటే.. బాల‌య్య‌బాబేన‌ని చెప్పుకోవ‌డంలో అతిశ‌యోక్తి లేదు.

ఇక వాస్త‌విక ప్ర‌పంచానికి ద‌గ్గ‌ర‌గా జీవించే క్రిష్ తిమ్మినిబొమ్మి చేయ‌డం తెలియ‌ద‌నే చెప్పాలి. ఏదో ఒక‌టి చేసి, ప్రేక్ష‌కుల‌ను బ‌లవంతంగా మెప్పించ‌డానికి ఆయ‌నెప్పుడూ ప్ర‌య‌త్నం చేయ‌లేదు. ఆయ‌న తీసిన ప్ర‌తీ సినిమా జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా ప్రేక్ష‌కుల మ‌దిలో నిలిచిపోయేవే. ఇందంతా ఎందుకు చెప్పాల్సి వ‌స్తుందంటే.. ఎన్టీఆర్ బ‌యోపిక్ ఫ‌స్ట్‌లుక్ పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల నేప‌థ్యమే. ఎన్టీఆర్ బ‌యోపిక్ ఫ‌స్ట్‌లుక్ నిజ‌మైన‌ది కాద‌నీ, దానిని మార్ఫింగ్ చేశార‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.. అది బ్లాక్ అండ్ క‌ల‌ర్‌లో ఉండ‌డంతో కొంత‌మేర‌కు అనుమానాలు వ్య‌క్త‌మ‌య్యాయి. వీట‌న్నింటినీ ప‌టాపంచ‌లు చేస్తూ క్రిష్ ఈసారి క‌ల‌ర్ ఫొటోని ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశారు.

అయితే, ఎన్టీఆర్ ప్రాజెక్టు సంబంధించిన మొద‌టి లుక్‌పైనే ఇలాంటి స్పంద‌న వ‌స్తే.. ఇక అన్న‌గారిని చూపిండంలో ఏం కాస్త అటుఇటు అయినా ప్రేక్ష‌కులు, విమ‌ర్శ‌కులు జీర్ణించుకోలేర‌న్న‌ది స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇప్ప‌టికే ఈ ప్రాజెక్టుకు తాను న్యాయం చేయ‌లేన‌ని ద‌ర్శ‌కుడు తేజ త‌ప్పుకున్న విష‌యం తెలిసిందే. ఆత‌ర్వాత బాల‌య్య‌బాబు ఈ ప్రాజెక్టును క్రిష్‌కు అప్ప‌గించిన విష‌యం విదిత‌మే. ఏదేమైనా.. అన్న‌గారి జీవితానికి మ‌చ్చ‌తేకుండా.. బ‌యోపిక్‌ను ఆంధ్రుల‌కు అందించాల్సిన బాధ్య‌త ద‌ర్శ‌కుడు క్రిష్‌, హీరో బాల‌య్య‌బాబుల‌దే..

DhWT7k-XUAEPabO

ఎన్టీఆర్ బయోపిక్…విమర్శకుల నోరు మూపించిన క్రిష్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share