ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో మ‌రో ట్విస్ట్‌..!

September 15, 2018 at 2:45 pm
NTR Biopic, Full control on NBK Films LLP, Balakrishna

నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించి మొదటి నుంచీ అనేక ట్విస్ట్లు.. మొదట తేజా డైరెక్టర్.. షూటింగ్ ప్రారంభం కాకముందే.. ఈ సినిమా తనవల్ల కాదంటూ.. తాను న్యాయం చేయలేనంటూ తేజ తప్పుకోవడం ఇండస్ట్రీలో పెద్ద సంచలనమే రేపింది. ఇక ఆ తర్వాత అనేక ఊహాగానాల మధ్య.. ఏం జరుగుతుందోనని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తరుణంలో నందమూరి బాలకృష్ణ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ntr-759

తనకు ఎంతో అచ్చొచ్చిన క్రిష్కే ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం కల్పించారు. ఇక అప్పటి నుంచి ఎన్టీఆర్ బయోపిక్పై అంచనాలు మరింత పెరిగాయి. చిత్రీకరణ కూడా వేగంగా పూర్తవుతోంది. ఇక ఈ సినిమాకి క్రిష్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సినిమా బడ్జెట్ కూడా పెరిగిందని ఇండస్ట్రీ లో టాక్.
ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో బాలయ్యబాబు, బసవతారకం పాత్రలో విద్యాబాలన్, ఇక చంద్రబాబు పాత్రలో రానా తో పాలు పలువురు అగ్రతారలు ఇందులో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించి మొదట విడుదల చేసిన ఎన్టీఆర్ పోస్టర్లో బాలయ్యబాబు అచ్చం ఎన్టీఆర్ లాగే కనిపించడం.. ఇటీవల చంద్రబాబు పాత్రలో నటిస్తున్న రాణా పోస్టర్కూడా అదుర్స్ అనిపించడంతో సినిమాపై అంచనాలు మించిపోతున్నాయి.

బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రాజెక్టుకు సంబందించి బడ్జెట్ కూడా రోజురోజుకూ పెరిగిపోతోంది. అంచనాలు మించిపోతోంది. ఈ క్రమంలోనే మరో ట్విస్ట్.. ఈ ప్రాజెక్టును పూర్తిగా ఎన్బీకే ఫిలిమ్స్ చేతిలోకి తీసుకునేందుకు బాలకృష్ణ నిర్ణయం తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ మేరకు చర్చలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని డిస్ట్రిబ్యూటర్స్ సుమారు రూ 100 కోట్లు పెట్టి సినిమా రైట్స్ సొంతం చేసుకునే ఆలోచనలో ఉన్నారని సమాచారం.

balakrishna_saikorrapati11459293315

ప్రస్తుతం ఈ సినిమాకు ప్రొడ్యూసర్లుగా సాయి అండ్ విష్టు వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు వీరు వెచ్చించిన మొత్తాన్ని సెటిల్ చేసేందుకు బాలయ్య బాబు నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ బయోపిక్ తెలుగు సినీ చరిత్రలోనే అద్భుతమైన ప్రాజెక్టుగా నిలిచిపోవాలని, ఇందుకు కోసం ఎంత ఖర్చు అయినా వెనకాడేది లేదనే ఆలోచనతో బాలక`ష్ణ ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ప్రస్తుత నిర్మాతల మాటేమిటో తెలియడం లేదు. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే.. మరికొన్ని రోజులు ఆగాల్సిందే మరి.

ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో మ‌రో ట్విస్ట్‌..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share