
ఎన్టీఆర్ బయోపిక్ అసలు కథ వేరే ఉందా..? ఇప్పటివరకు వినిపించిన టాక్ ఉత్తదేనా..? అంటే ఇండస్ట్రీవర్గాలు ఔననే అంటున్నాయి. ఎన్టీఆర్ జీవితం ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ పాత్రలో బాలక`ష్ణ, బసవతారకం పాత్రలో విద్యాబాలన్, చంద్రబాబుగా రానా నటిస్తున్న విషయం విదితమే. ఎప్పుడైతే ఈ ప్రాజెక్టు నుంచి తేజ తప్పుకుని క్రిష్ అడుగుపెట్టారో.. అప్పటి నుంచి స్క్రిప్ట్ మొత్తమే మారిపోయిందనీ.. ఒక భాగం నుంచి రెండో భాగం దాకా వెళ్లిందన్నది స్పష్టమే. అయితే ఇప్పుడు మొదటి భాగంలో ఏం ఉంటుంది..? రెండో భాగంలో ఏముంటుందన్నది మాత్రం స్పష్టంగా తెలియడం లేదు.
ఇప్పటివరకు మొదటి భాగంలో ఎన్టీఆర్ సీనిరంగానికి సంబంధించిన అంశాలు ఉంటాయని, ఇక్కడితో ఈ భాగాన్ని పూర్తి చేసి, రెండో భాగంలో రాజకీయరంగం గురించి ఉంటుందనే ప్రచారం జరిగింది. తాజాగా.. ఇందులో కూడా మార్పులు ఉన్నాయని, అసలు స్రిప్ట్ వేరే ఉందనే టాక్ వినిపిస్తోంది. మొదటి భాగంలో ఎక్కువగా డ్రామా స్టైల్లో కథ నడుస్తుందని, ఎన్టీఆర్ బాల్యం, యవ్వనం, కష్టపడడం, ఎదగడం, పెళ్లి, భార్య బసవతారకంతో అనుబంధం వరకు ఉటుందని ఇండస్ట్రీవర్గాలు అంటున్నాయి. ఇక ఇందులో హరికృష్ణ, చంద్రబాబు పాత్రలే కీలకంగా వుంటాయని సమాచారం. సినిమా పాత్రలు, పాటలు అన్నీపైపైన చూపిస్తారనే టాక్ వినిపిస్తోంది.
ఇక ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగంలో రాజకీయం ఎక్కువగా ఉంటుందని టాక్. ఇందులో ప్రధానంగా దివిసీమ ఉప్పెన వంటి వ్యవహారాలు వుంటాయని తెలుస్తోంది. ఎన్టీఆర్ కు అవమానం జరగడం, రాజకీయ రంగంలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకోవడం.. ఇలా సీరియఎస్గా కథ నడుస్తుందట. దివిసీమ ఉప్పెన పార్ట్ వచ్చినపుడు మండలి వెంకట కృష్ణారావు పాత్ర వుంటుందట. ఆ పాత్ర కోసం ఇప్పటి ఆయన వారసుడు మండలి బుద్ద ప్రసాద్ ను నటింపచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా దర్శకుడు క్రిష్ ఈ సినిమాపై ఎప్పుడూ హైప్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ఇందులో భాగంగానే.. ఈ బయోపిక్కు సంబంధించి, రకరకాల స్టిల్స్ జనంలోకి వదుల్తూ వస్తున్నారు.