ఎన్టీఆర్‌లో కట్టప్ప సీన్ లేనట్టేనా…!

September 6, 2018 at 9:29 am
NTR Biopic, Kattapa scene, Bahubali, Balakrishna, krishna, Rana daggubati

విశ్వ‌విఖ్యాత న‌టుడు నంద‌మూరి తార‌క‌రామారావు. తెలుగు ప్ర‌జ‌ల ఆత్మ‌గౌర‌వ ప్ర‌తీక. ఆయ‌న‌ జీవితం ఆధారంగా తెర‌కెక్కుతున్న ఎన్టీఆర్ బ‌యోపిక్‌పైనే ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. సినీ, రాజ‌కీయ రంగాల్లో చెర‌గ‌ని ముద్ర‌వేసిన ఎన్టీఆర్ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు. ఇక ఇందులో వెన్నుపోటును ఎవ‌రు మ‌రిచిపోగ‌ల‌రు..! అయితే ఇప్పుడు అంద‌రి డౌటేమిటంటే.. అన్న‌గారి జీవిత పార్శ్వాల‌న్నింటినీ ఇందులో స్ప‌`షించి ప‌రిపూర్ణం చేస్తారా..? లేక కొన్నింటికే ప‌రిమితం చేస్తారా..? అని. ఈ విష‌యంలో మాత్రం ఇంకా క్లారిటీ రావ‌డం లేదు. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ వ‌స్తున్న ఈ బ‌యోపిక్ తెలుగు రాజ‌కీయాల‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ద‌ర్శ‌కుడు క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో బాల‌య్య‌బాబు కీ రోల్ పోషిస్తున్న విష‌యం తెలిసిందే.

Krish_Jagarlamundi_NTR

బ‌యోపిక్ నుంచి తేజ త‌ప్పుకున్న త‌ర్వాత బాల‌క‌`ష్ణ ఏరికోరి క్రిష్‌ను ఎంపిక చేసుకున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్‌లో శ‌ర‌వేగంగా కొన‌సాగుతోంది. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి, అధికారంలోకి వ‌చ్చిన నాటి స‌న్నివేశాల‌పై చిత్రీక‌ర‌ణ కొన‌సాగుతోంది. ఇందులో ఎన్టీఆర్ పాత్ర‌లో బాల‌క‌`ష్ణ‌, బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో విద్యాబాల‌న్‌.. ఇలా రానాతోపాటు ప‌లువురు అగ్ర‌న‌టులు కూడా ఇందులో న‌టిస్తున్నారు. నిజానికి ఈ బ‌యోపిక్ క్రిష్‌తోపాటు బాల‌క‌`ష్ణ‌కూ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ప్రాజెక్టు. నంద‌మూరి తార‌క‌రామారావు జీవితం తెరిచిన పుస్త‌కం. ఇందులో తెర‌పై ఏం కొంచెం అటిటు అయినా.. ఇక అంతేసంగ‌తులు. తీవ్ర విమ‌ర్శ‌ల పాలు కాక‌త‌ప్ప‌దు. ఇప్ప‌టికే ప‌లు చారిత్ర‌క‌, సామాజిక అంశాల‌ను తెర‌పై అద్భుతంగా ఆవిష్క‌రించిన క్రిష్ ఎలా మెప్పిస్తార‌న్న‌దే కీల‌కం.

rana-daggubati-759

మ‌రికొన్ని నెల‌ల్లో ఎన్నిక‌లు వ‌స్తున్నాయి.. ఈ క్ర‌మంలోనే ఎన్టీఆర్ బ‌యోపిక్ కూడా వ‌స్తోంది. ప్ర‌స్తుతం నంద‌మూరి బాల‌క‌`ష్ణ టీడీపీ ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. మ‌రి ఇలాంటి స‌మ‌యంలో ఎన్టీఆర్ లో బాబుగారి వెన్నుపోటు సీన్‌ను పొందుప‌రుస్తారా..? అంటే మాత్రం డౌటుగానే క‌నిపిస్తోంది. ఈ ఎపిసోడ్‌ను సినిమాలో పొందుప‌రిచి వియ్యంకుడితో బాలయ్య‌బాబు క‌య్యానికి దిగుతార‌ని ఎవ‌రూ అనుకోవ‌డం లేదు. అయితే.. ఎన్టీఆర్ టీడీపీ స్థాపించి, పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి, తెలుగు ప్ర‌జ‌ల ఆత్మ‌గౌర‌వాన్ని కాపాడ‌డం వ‌ర‌కే ప‌రిమితం చేసే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ప‌లువురు విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో ఆ ఎపిసోడ్‌ను ఉన్న‌ది ఉన్న‌ట్లుగా చూపించి ద‌ర్శ‌కుడు త‌న నిజాయితీని చాటుకుంటారా..? లేదా..? అన్న‌ది తెలియాలంటే విడుద‌ల వ‌ర‌కు ఆగాల్సిందే మ‌రి.

ఎన్టీఆర్‌లో కట్టప్ప సీన్ లేనట్టేనా…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share