‘ఎన్టీఆర్’ అనుకున్నట్టుగానే…

November 5, 2018 at 3:20 pm

టాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘ఎన్టీఆర్’బయోపిక్. నందమూరి బాలకృష్ణ – క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా తీస్తున్నారు. ‘కథానాయకుడు’.. ‘మహానాయకుడు’ టైటిల్స్ ఇప్పటికే పోస్టర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ షరవేగంగా జరుగుతుంది. ఈ బయోపిక్ గురించి రీసెంట్ గా కొన్ని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. త్వరలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపిలో రాజకీయ పరిణాలు మారుతున్న దృష్ట్యా సెకండ్ పార్ట్ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’లో కొన్ని మార్పులు చేర్పులు చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ntr-770x433

ఒకవేళ అలా స్క్రిప్ట్ లో మార్పులు చేసే పక్షంలో ఈ సినిమా అనుకున్న సమయానికి రిలీజయ్యే అవకాశం లేదని అన్నారు. మరోవైపు బాలయ్యకు సెంటిమెంట్ నెల అయిన జనవరి సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈ సినిమాలు రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. మరి ఈ వార్తలు నిజమేనా? ‘ఎన్టీఆర్’ టీమ్ కు సన్నిహితంగా ఉండేవారు ఈ వార్తలను ఊహాగానాలు మాత్రమే అని కొట్టిపారేస్తున్నారు.

అయితే సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి ముందు ఏ కథ అయితే అనుకున్నారో..అందులో ఒక్క అక్షరం కూడా మార్చేది లేదని చిత్ర యూనిట్ అంటుంది. ఈ లెక్కన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ జనవరి 9 న.. ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ ముందు అనుకున్నట్టే జనవరి 24 న రిలీజ్ అవడం ఖాయమని అంటున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో టీజర్ ట్రైలర్లు ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉంది.

‘ఎన్టీఆర్’ అనుకున్నట్టుగానే…
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share