ఎన్టీఆర్ కు భారీ రేటు సమర్పించుకున్న ఓవ‌ర్సీఎస్!

November 2, 2018 at 9:11 am

ప్ర‌స్తుతం.. టాలీవుడ్‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క ప్రాజెక్టు ఎన్టీఆర్ బ‌యోపిక్‌. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ బ‌యోపిక్ రెండు భాగాలుగా రూపొందుతోంది. వీటికి సంబంధించిన చిత్రీక‌ర‌ణ కూడా ఏక‌కాలంలో జ‌రుగుతోంది. వ‌చ్చే సంక్రాంతికి మొద‌టి ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు విడుద‌ల చేసేందుకు చిత్ర‌యూనిట్ క‌స‌రత్తు చేస్తోంది. ఇక రెండో భాగం ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు ఫిబ్ర‌వ‌రిలో విడుద‌ల చేసేందుకు నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది. ఇక ఇందులో ఎన్టీఆర్ పాత్ర‌లో బాల‌య్య‌బాబు, బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో విద్యాబాల‌న్‌, చంద్ర‌బాబుగా రానా, ఏఎన్నార్‌గా సుమంత్ త‌దిత‌ర ప్ర‌ముఖ న‌టులు ఇందులో న‌టిస్తున్నారు. ఈ ప్రాజెక్టు స్టార్ట్ అయిన‌ప్ప‌టి నుంచే అంద‌రిలో ఆస‌క్తినిరేకెత్తిస్తోంది.

39190055_2020320364686819_8928918527969067008_n

అయితే.. సినిమా, రాజ‌కీయ రంగాల్లో త‌న‌దైన ముద్ర‌వేసిన ఎన్టీఆర్ జీవితంలో ఎన్నో ఆస‌క్తిక‌ర‌మైన ఘ‌ట్టాలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఈ సినిమాను అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచే హైప్ క్రియేట్ అవుతోంది. ఇప్పుడు దాదాపుగా చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న వేళ‌.. అన్నిఏరియాల్లో ఈ సినిమాను కొనేందుకు బ‌య్య‌ర్లు ఆతృతగా ఉన్నారు. ఇక ఓవ‌ర్సీస్ హ‌క్కులు అయితే.. క‌ళ్లు చెదిరే రేట్‌కు అమ్ముడుపోతాయ‌నే టాక్ వినిపిస్తోంది. సుమారు రూ.20కోట్ల‌కుపైగా ధ‌ర ఉంటుంద‌ని ఇండ‌స్ట్రీవ‌ర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా ఇది ఈ సినిమా నిర్మాత‌ల‌కు బాగా క‌లిసొచ్చే అంశంగా చెబుతున్నారు.

ఓవ‌ర్సీస్‌లో ఈ రెండు భాగాలు వ‌సూళ్ల సునామీ సృష్టిస్తాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సుమారు 4.5మిలియ‌న్ డాల‌ర్లు వ‌సూలు చేయ‌డం గ్యారంటీ అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంటే ఈ రెండు భాగాలు కూడా బ్లాక్‌బ‌స్ట‌ర్స్ అయితే.. ఇక తిరుగే ఉండ‌దు. ఇప్ప‌టికే ఓవ‌ర్సీస్‌లో క్రిష్‌-బాల‌య్య కాంబినేష‌న్‌లో వ‌చ్చిన గౌత‌మీపుత్ర‌శాత‌క‌ర్ణి సినిమా మాంచి వ‌సూళ్లు రాబ‌ట్టింది. 1.5మిలియ‌న్ డాల‌ర్ల క‌న్నా ఎక్కువ‌గానే రాబ‌ట్టింది. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌కు మాంచి ఫాలోయింగ్ ఉంది. ఇందుకు త‌గ్గ‌ట్టుగానే క్రిష్ కూడా హైప్ పోస్ట‌ర్ల‌తో హైప్ క్రియేట్ చేస్తున్నాడు. ఈ నేప‌థ్యంలో ఓవ‌ర్సీస్‌లో అంత‌మొత్తానికి కొనేందుకు డిస్ట్రిబ్యూష‌న్ హౌస్ సిద్ధ‌ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్ కు భారీ రేటు సమర్పించుకున్న ఓవ‌ర్సీఎస్!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share