‘ఎన్టీఆర్‌ బయోపిక్’ సీక్రెట్ ఇన్వెస్ట‌ర్ ఆయ‌నేనా..?

October 23, 2018 at 8:11 pm

విశ్వ‌విఖ్యాత న‌టుడు నంద‌మూరి తార‌క‌రామారావు జీవిత ఆధారంగా ఎన్టీఆర్ బ‌యోపిక్ రెండు భాగాలుగా వ‌స్తున్న విష‌యం తెలిసిందే. మొద‌టి భాగానికి క‌థానాయ‌కుడు, రెండో భాగానికి మ‌హానాయ‌కుడు అనే టైటిళ్లు కూడా ఖ‌రారు అయ్యాయి. ఈ రెండు భాగాలు ఏక‌కాలంలో క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుంటున్నాయి. ఎన్టీఆర్ పాత్ర‌లో బాలకృష్ణ, బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో విద్యాబాల‌న్‌, చంద్ర‌బాబు పాత్ర‌లో రానా, అక్కినేనిగా సుమంత్ న‌టిస్తున్నారు. ఇక ఈ బ‌యోపిక్ రెండు భాగాల‌కు బాలకృష్ణతో సహా మురళీమోహన్ మేనల్లుడు విష్ణు ఇందూరి, ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

44511023_1736551803139083_1755345686401908736_n

అయితే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఒక‌టి చ‌క్క‌ర్లు కొడుతోంది. అదేమిటంటే.. ఎన్టీఆర్ బ‌యోపిక్ భాగాల‌కు పై నిర్మాత‌ల‌తో పాటు మ‌రో నిర్మాత కూడా ఉన్నార‌నే టాక్ వినిపిస్తోంది. ఆ నిర్మాత మ‌రెవ‌రో కాదు వెనిగ‌ళ్ల‌ ఆనంద‌ప్ర‌సాద్‌. భవ్య క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్‌, భవ్య సిమెంట్స్‌, చిత్ర నిర్మాణ సంస్థ భావ్య క్రియేష‌న్స్‌కు ఆయ‌న య‌జ‌మానిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అంతేకాదు.. బాలకృష్ణ నటించిన ‘పైసా వ‌సూల్’ సినిమాకు ఆయ‌న నిర్మాత అన్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఎన్టీఆర్ బ‌యోపిక్‌కు కూడా సీక్రెట్ ఇన్వెస్ట‌ర్ అనే టాక్ వినిపిస్తోంది. అయితే.. హైద‌రాబాద్‌లోని సార‌ధి స్టూడియోలో షూటింగ్ స్పాట్‌లో ఆనంద‌ప్ర‌సాద్ ఒక్క‌సారిగా ప్ర‌త్య‌క్షం కావ‌డం కూడా ఇందుకు బలాన్ని ఇస్తోంది.

ఆయ‌న నిర్మాత కావ‌డం వ‌ల్లే.. షూటింగ్ ఎలా జ‌రుగుతుందో తెలుసుకోవ‌డానికే ఆయ‌న ఇక్క‌డి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండ‌గా ఇక్క‌డ మ‌రో టాక్ కూడా వినిపిస్తోంది. ఆనంద‌ప్ర‌సాద్ రాజ‌కీయ కార‌ణాల వ‌ల్లే బాలకృష్ణను క‌లిసేందుకు వ‌చ్చి ఉంటార‌ని ప‌లువురు అంటున్నారు. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఖ‌మ్మం జిల్లా వాసి అయిన ఆనంద‌ప్ర‌సాద్ గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లోని శేర్ లింగంప‌ల్లి టికెట్ దాదాపు కన్ఫార్మ్ అయినట్టే తెలుస్తుంది, ఆ విష‌యం మాట్లాడేందుకు ఆయ‌న ఇక్క‌డి వ‌చ్చార‌ని భావిస్తున్నారు.

నిజానికి.. ఇప్ప‌టికే టీటీడీపీ నేత‌ల్లో ఆశావ‌హులు బాల‌య్య‌చుట్టూ తిరుగుతున్న విష‌యం తెలిసిందే. ఇక ఆనంద‌ప్ర‌సాద్ విష‌యంలో క్లారిటీ రావాలంటే మ‌రికొద్ది రోజులు ఆగాల్సిందే మ‌రి. దానికి తోడు ‘పైసా వ‌సూల్’ సినిమా మిగిల్చిన నష్టాన్ని ఆనంద‌ప్ర‌సాద్ ఎన్టీఆర్ సినిమా రూపంలో రాబట్టనున్నురా అన్న గుస గుసలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా తెలంగాణ పొలిటికల్ హీట్, ఎన్టీఆర్ బయోపిక్ సినిమా ఒకేసారి జరగడంతో నందమూరి ఇంట మాంచి బజ్ నడుస్తుంది.

‘ఎన్టీఆర్‌ బయోపిక్’ సీక్రెట్ ఇన్వెస్ట‌ర్ ఆయ‌నేనా..?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share