ఎన్టీఆర్ బయోపిక్ లో రామోజీ రావు సందడి

July 11, 2018 at 7:37 pm
NTR Biopic, Sets, Ramojirao, Director krish, Tweet

ఎన్టీఆర్ బయోపిక్ ఏ సమయంలో స్టార్ట్ అయిందో కానీ వెను వెంటనే తేజ దర్శకత్వం నుండి బాలయ్యకు శాతకర్ణి లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చిన క్రిష్ చేతుల్లోకి వచ్చి వాలింది. అసలే క్రిష్ అనుకున్న బడ్జెట్లో , అనుకున్న సమయంలో సినిమా తీసి మన ముందు ఉంచగల ఘటికుడు, ఈ విషయం మనకు బాలయ్య శాతకర్ణితో అర్తమైపోయింది. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ కూడా అదే స్పీడ్ లో క్రిష్ పట్టాలెక్కేచేస్తున్నాడు, ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు ప్రస్తుతం రామోజీ రావు ఫిలిం సిటీలో జరుపు కుంటుంది.

ఈ రోజు షూటింగ్ లో భాగంగా ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు గారిని క్రిష్ కలిశారు. ఈ విషయం పై క్రిష్ ట్వీట్ చేస్తూ ” ప్రముఖ దిగ్గజం రామోజీ రావు గారిని ఎన్టీఆర్ షూటింగ్ సెట్స్ లో కలవటం నిజంగా ఎంతో గౌరవంగా భావిస్తున్న, తనతో పాటు చిత్ర యూనిట్ అంత రామోజీ రావు గారితో గడిపిన ఈ అర్ధగంట సమయం లో ఎన్నో విషయాలు నేర్చుకున్నాం అని తెలిపుతూ..రామోజీ రావు గారు నిజంగా ఒక లెజెండ్ మీకు ధన్యవాదాలు సర్” అని ట్వీట్ చేసారు.

ఎన్టీఆర్ బయోపిక్ లో రామోజీ రావు సందడి
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share