తప్పు ఎన్టీఆర్ ది కాదు…డైరెక్టర్లదే!

November 3, 2018 at 10:38 am

`ఎన్టీఆర్‌ది ఇదే బెస్ట్ పెర్ఫామెన్స్ కాదు. ఇప్ప‌టి వ‌చ్చిన ఏ సినిమాల్లోనూ ఆయ‌న బెస్ట్ పెర్ఫామెన్స్ ఇవ్వ‌లేదు` ఇవీ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ చెప్పిన మాట‌లు. అంటే ఇక్క‌డ ఆయ‌న ఉద్దేశం. ఎన్టీఆర్ సామార్థ్యానికి త‌గ్గ‌ట్టు క‌థ‌లు రావ‌డం లేద‌ని. ఆయ‌నకు త‌గ్గ సినిమా ఇంకా రాలేద‌ని త్రివిక్ర‌మ్ ప‌రోక్షంగా చెప్పుకొచ్చాడు. ఇటీవ‌ల విడుద‌ల అయిన అర‌వింద స‌మేత వీర రాఘ‌వ సినిమా సంద‌ర్భంగా ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. నిజానికి.. ఇది నిజ‌మేకావొచ్చు. జూనియ‌ర్ ఎన్టీఆర్ కెరీర్‌లో ది బెస్ట్ సినిమా `సింహాద్రి`. బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచిన‌ ఈ చిత్రం వ‌చ్చి సుమారు ప‌దిహేనేళ్లు అవుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మ‌ళ్లీ ఆ స్థాయి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాకు ఆయ‌న‌కు రాలేదు.

maxresdefault

అదేమిటీ.. ఎన్టీఆర్ సినిమాలు బాగానే ఆడుతున్నాయి క‌దా.. అంటే ఆడుతున్నాయి.. కానీ అవి అంత‌వ‌ర‌కే. త‌న‌దైన న‌ట‌న‌తో త‌న మార్కెట్‌ని కాపాడుకుంటున్నా.. క‌థ‌ల‌ప‌రంగా ఆయ‌న స్థాయికి త‌గ్గ‌ట్టు రావ‌డం లేద‌ని చెప్పొచ్చు. అయితే.. ఈ క్ర‌మంలో కొన్ని హిట్లు కొట్టినా.. సింహాద్రి లాంటి సినిమాలు మాత్రం కావ‌నే చెప్పుకొవాలి. ఇవ‌న్నీ కూడా ఓపెనింగ్స్‌వ‌ర‌కు మాత్ర‌మే ఓకే. అయితే.. ఆయ‌న మాత్రం ఎక్క‌డ కూడా త‌న ప్ర‌య‌త్నాన్ని ఆప‌డం లేదు. శ‌క్తివంచ‌న‌లేకుండా క‌`షి చేస్తూనే ఉన్నాడు. నిజానికి.. ఆయ‌న త‌న ఆహార్యాన్ని మార్చుకుంటున్న తీరు.. చూస్తుంటే.. ఇది మ‌రెవ‌రికీ సాధ్యం కాదేమోన‌ని అనిపిస్తుంది.

డ్యాన్స్‌లో, ఎమోష‌న్‌లో.. ఎలాంటి స‌న్నివేశాల్లోనైనా ఒదిగిపోయే సామ‌ర్థ్యం ఉన్న ఏకైక యంగ్ హీరో ఎన్టీఆర్ అని ఇప్ప‌టికే ప‌లువురు ద‌ర్శ‌కులు చెప్పారు. ఆయ‌న‌తో ప‌ని చేయ‌డం ఎంతో సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని అంటుంటారు. కానీ.. ఆయ‌న స్థాయికి త‌గ్గ క‌థ‌లు రాయ‌డంలో మాత్రం విఫ‌లం అవుతున్నార‌నే చెప్పొచ్చు. అంటే.. ఇక్క‌డ ఎన్టీఆర్‌ని ద‌ర్శ‌కులు పూర్తి స్థాయిలో వాడుకోవ‌డం లేద‌ని అర్థం. ఏదో కొత్త‌క‌థ‌లు అంటూ ఆయ‌న‌తో సినిమాలు చేస్తున్నారే త‌ప్ప సింహాద్రిలాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్‌ను మాత్రం అందించ‌లేక‌పోతున్నారు. ముందుముందు అయినా మ‌న ద‌ర్శ‌కులు ఎన్టీఆర్ సామార్థ్యానికి త‌గిన క‌థ‌లు రాస్తారేమో చూద్దాం.

తప్పు ఎన్టీఆర్ ది కాదు…డైరెక్టర్లదే!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share